Site icon 123Nellore

ఆ కంపెనీలకు కోట్లల్లో పెట్టుబడి పెడుతున్న నయనతార!

Nayantara: టాలీవుడ్ ప్రేక్షకులకు నయనతార గురించి పరిచయం అవసరమే లేదు. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. పోగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది.

Nayantara

‘చంద్రముఖి’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయినా ఈ ముద్దు గుమ్మ. ఆపై గజిని, బాస్, లక్ష్మి, వంటి సినిమాలు ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపునిచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ‘వల్లభ’ సినిమా కుర్రకారులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టీవ్ గా ఉంటుంది.

ఇక డైరెక్టర్ విగ్నేశ్ శివన్ తో కొంత కాలంగా డేటింగ్ లో ఉంటున్న సంగతి మనకు తెలుసు. ఆ మధ్య దుబాయ్ లో న్యూ ఇయర్ రోజున బుర్జ్ ఖలీఫా వద్ద ఈ జంట తెగ హడావిడి చేశారు. ఈ క్రమంలో దుబాయ్ కి చెందిన ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు కోలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఆయిల్ కంపెనీలో దాదాపుగా 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి.

నయనతార, విగ్నేష్ శివన్ లు కొత్త సంవత్సర వేడుకలు దుబాయ్ లో జరుపుకున్నారు. ఈ జంట బిజినెస్ పనిమీద దుబాయ్ వెళ్లి అక్కడే నూతన సంవత్సరాన్ని గడిపినట్టు వార్తలు తెగ చక్కెర్లు కొడుతున్నాయి.

Exit mobile version