Site icon 123Nellore

గుర్తుపట్టలేని విధంగా ఉన్న యాక్టర్ నవదీప్ న్యూ లుక్!

Navdeep: టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ నవదీప్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. జై సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఇతడు.. ఆపై పలు సినిమాల్లో సహాయ పాత్రల్లోనూ నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నవదీప్ సోషల్ మీడియా ఇన్ స్టా లో కూడా బాగానే యాక్టీవ్ గా ఉంటాడు.

ఈ క్రమంలో తన ఇన్ స్టా ఖాతాలో నవదీప్ తన న్యూ లుక్ ని పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ లో ఎవరూ గుర్తు పట్టని విధంగా బాలీవుడ్ రేంజ్ లో ఉన్నాడు. ఎప్పుడో ‘చందమామ’ సినిమాలో మెరిసిన నవదీప్ ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాడు. అది నవదీప్ చేసే కొత్త సినిమా న్యూ లుక్ అని తెలిపాడు.

అవనీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ మౌళి’ దీన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్స్ వారు రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నవదీప్ సరసన ఫంకూరి గిద్వానీ మెప్పించ బోతుంది. సో నవదీప్ ఈ సినిమా కోసం ఎవరు ఊహించని విధంగా వేరే స్థాయిలో ఉన్నాడు. ఇక నవదీప్ న్యూ లుక్ ను తన పుట్టిన రోజు జనవరి 26 న విడుదల చేశారు సినీ బృందం. ప్రస్తుతం ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పటి వరకు స్టార్ హోదా లేని నవదీప్.. మరి ఈ సినిమాతో అయినా స్టార్ గా వెలుగుతాడో లేదో చూడాలి.

Exit mobile version