కశ్మీరీ పండిట్ల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’. అనేక అవరోధాలను దాటుకుని మార్చి 11న ఈ చిత్రం జనం ముందుకు వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ చిత్రంపై రాజుకున్న రాజకీయ రచ్చ కూడా అంతా ఇంతా కాదు. తాజాగా ఈ చిత్రంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూాడా కీలక వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం నాడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన వారందరినీ కొత్తగా విడుదల చేసిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ లాంటి చిత్రాలు మరిన్ని రావాలని.. వీటి వల్ల ప్రజలకు నిజాలు తెలుస్తాయని మోదీ అన్నారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్ల బాధను చూపించారు. మరో వైపు సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు రావడంతో జనాల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
जो लोग Freedom Of Expression के झंडे लेकर घूमते हैं वो पूरी जमात पिछले 5-6 दिनों से बौखलाई हुई है
जो सत्य है उसे सही स्वरूप में दुनिया के सामने लाना देश की भलाई के लिए होता है : PM @narendramodi जी#TheKashmirFiles pic.twitter.com/5kfw7M8rck
— RajyavardhanRathore (@Ra_THORe) March 15, 2022
అయితే మరోవైపు ఈ చిత్రంపై రాజకీయ వివాదం రాజుకుంది. కేరళ కాంగ్రెస్.. ఈ చిత్రంపై వరుస ట్వీట్లు చేసింది. 1990-2007 మధ్య కాలమైన 17 ఏళ్లలో కశ్మీర్ పండిట్ల కంటే ఎక్కువ మంది ముస్లింలను హత్య చేశారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కశ్మీర్ లోయ నుంచి పండిట్లను వెళ్లగొట్టే సమయంలో జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న జగ్‌మోహన్ ఓ ఆర్ఎస్ఎస్ వ్యక్తని కాంగ్రెస్ తెలిపింది. అంతేకాకుండా ఆ సమయంలో కేంద్రంలో భాజపా మద్దతిచ్చిన వీపీ సింగ్ సర్కార్ అధికారంలో ఉందని వెల్లడించింది. అయితే ఈ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.