సాధారణంగా పాములను చూస్తే చాలా మంది భయపడుతుంటారు. ప్రపంచంలో ఉండే చాలా జంతు రకాల్లో పాము కూడా ఒకటి కానీ దానికి ఉంటే విషం వల్ల దానిని చూస్తే చాలా మంది బయపడుంటారు. ఇలా ఒకటి కాదు.. ఈ భూ మండలం మీద చాల రకాల పాములు ఉన్నాయి. దాదాపు అన్ని రకాల పాములు విషపూరితమైనవా అని అంటే కచ్చితంగా కాదు అని చెప్పాలి. వాటిలో కొన్ని సాధారణ పాములు కూడా ఉంటాయి. మరి కొన్ని మాత్రం మనిషి ప్రాణాలు ఇట్టే తీసేస్తాయి. ఇలాంటి పామే ఒకటి అందరినీ భయపెడుతుంది. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఈ పాము చూసేందుకు అచ్చం నాచు (గడ్డి) వలే ఉంటింది. ఈ అరుదైన పామును థాయిలాండ్ లో గుర్తించారు. అయితే ఈ పాము ఉండే దానిని చూసి ఇది మిస్టీరియస్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఇలాంటి పామును ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. అందుకే ఇది ప్రస్తుతం యూట్యూబ్‌లో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ పాము చూసేందుకు పైన నాచువలే ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నా కానీ చాలా ప్రమాదకరం అని అంటున్నారు పరిశోధులు. ఇది కాటు వేస్తే అంతే సంగతులు అని చెప్తున్నారు. ఈ పాము పొడవు కనీసం రెండు అడుగులు ఉంటుందని తెలిపారు. దీనిని స్థానికంగా ఉండే తూ అనే వ్యక్తి ఈ పామును గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ పాముకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు చాలా భయపడుతున్నారు.