Site icon 123Nellore

నా కొడుకు బ్రేక్ అప్ చెప్పలేదు వాళ్ళు కలుస్తారు: షన్ను ఫాదర్ కామెంట్స్

Shannu Father :మొన్నటి వరకు దీప్తి సునయన షన్ను లవ్ స్టొరీ ని నెటిజన్లు ఎంతగానో ఇష్టపడే వారు. వారిది వేరే లెవెల్ బాండింగ్ అని మెచ్చుకునే వారు. ఇక కొంతమంది ఆ జంటని ఇన్స్పిరేషన్గా తీసుకునేవారు. షన్ను ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి బయటకు వచ్చాడొ అప్పుడే ఆ బంధానికి పుల్ స్టాప్ పడింది. అలా కావడానికి కారణం అందరికీ తెలుసు.

Shannu Father

ఆ మధ్య ఈ బ్రేక్అప్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు కూడా జరిగాయి. ఈ జంటని ఎక్కువగా ఇష్టపడేవారు ఈ బ్రేక్అప్ ని జీర్ణచుకోలేకపోయారు. ఆ తర్వాత చాలా మంది నెటిజన్లు ఆ జంట కలుస్తారు అనే హోప్ తో ఉన్నారు. ఇదిలా ఉంటే షన్ను ఫాదర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలా స్పందించాడు.

వాళ్ళు ఇద్దరూ కలిసి ఉంటారు. బ్రేకప్ దీప్తి చెప్పింది కానీ, షణ్ముఖ్ ఎక్కడా చెప్పలేదు. వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. కాకపోతే ఆ అమ్మాయికి ఏమనిపించిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అలా పోస్ట్ పెట్టింది. వాళ్లు కలవడానికి కొంతసమయం పడుతుంది ఏమో కానీ కలిసే ఉంటారు.

ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం.. అంతా మంచే జరుగుతుంది. ఈ విషయంలో అభిమానులు అనుమానించాల్సిన అవసరం లేదు. అని చెప్పుకొచ్చాడు షన్నూ ఫాదర్. మరి షన్నూ ఫాదర్ ఇచ్చిన మాట ప్రకారం త్వరలో అయినా కలుస్తారో లేదో చూడాలి ఈ క్యూట్ కపుల్.

Exit mobile version