Site icon 123Nellore

మోడల్ ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి వచ్చిన కొన్ని నిజాలు!

model: ఇటీవల జోధ్‌పూర్‌కు చెందిన ఒక మోడల్ గున్ గున్ ఆత్మహత్య చేసుకోబోయిన సంగతి మనకు తెలిసిందే. ఆ మోడల్ అలా చేసుకోవడానికి కారణమైన ఇద్దరు నిందితులను జోధ్‌పూర్‌కు చెందిన పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం అక్కడ స్థానికులకు భయాందోళనలకు గురి చేసింది. ప్రస్తుతం ఆమె ఇప్పుడు హాస్పటల్ లో చికిత్స పొందుతుంది.

model

ఇక జరిగిన దాని గురించి ఆ బాధితురాలి తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు ఈ ఘటన గురించి కొన్ని కొత్త నిజాలు వెలుగులోకి తీసుకొచ్చారు. మోడల్ గున్ గున్ ను ఎరగా వేసి భిల్వారా మంత్రిని హనీ ట్రాప్ చేసేందుకు నిందితులు పన్నాగం పన్నారు అని తెలుస్తుంది.

ఇలా ఆ నిందితులు పాల్పడదానికి కారణం బిల్వారా కు చెందిన మంత్రి ఆ నిందితుల ఫైల్ కి సైన్ చేయకుండా రిజెక్ట్ చేసినందుకు ఇంతటి దారుణానికి వడి కట్టినట్టు తెలుస్తుంది. సో ప్లాన్ ప్రకారం మోడలింగ్ అసైన్మెంట్ ఉందంటూ నాటకం ఆడి ఆ నిందితులు గున్ గున్ తో మెల్లగా పరిచయం పెంచుకున్నారు.

ఆ తర్వాత వాళ్లు అసైన్మెంట్ పేరుతో అక్కడికి వెళ్లగా ఆ నిందితులు ఆమెను మంత్రితో గడపాలి అని చెప్పారు. దానికి భయంతో గున్ గున్ అక్కడి నుంచి పారిపోయి వచ్చి లార్డ్స్‌ ఇన్ హోటల్ లో దిగింది. ఆ తర్వాత జరిగిన దాని గురించి వాళ్ళ నాన్నకు చెప్పి ఆ హోటల్ పై నుంచి కిందికి దూకింది. ఇక ఈ విషయాలన్ని డీసీపీ భువన్ భూషణ్ తెలిపారు.

Exit mobile version