Site icon 123Nellore

దొంగ ఏడుపులకు భువనేశ్వరి స్పందంచడమేంటో?- ఆర్కే రోజా

అసెంబ్లీ వేదికగా తన ఫ్యామిలీని అవమానించారన్న కారణంతో.. చంద్రబాబు మీడియా ముందు కంటనీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా భువనేశ్వరి కూడా స్పందించారు. అయితే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఆడవాళ్లను అనవసరంగా ఏడిపించిన వాళ్లు వారి పాపాన వాళ్లే పోతారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని దారుణాలు జరిగాయో అందిరికీ తెలుసని.. అప్పుడు మాట్లాడని భువనేశ్వరి.. ఇప్పుడు దొంగ ఎడుపులకు స్పందించడం ఏంటని ప్రశ్నించారు.

చంద్రబాబు నాటకాలు జనాలకు తెలిసే.. 23 సీట్లను కట్టిపెట్టారని.. జగన్ ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తుందని అన్నారు. ఆడవాళ్లకు సముచిత న్యాయం కల్పించడంలో వైకాపా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని.. చంద్రబాబు హయాంలో ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు అన్యాయమైపోయాయని.. అలాంటి వ్యక్తి గురించి గొప్పగా ఊహించుకోవడం మీ భ్రమేనని భువనేశ్వరిని ఉద్దేశించి అన్నారు రోజా.

ఎమ్మార్వో వనజాక్షిపై దాడి జరిగిన రోజు స్పందించని భువనేశ్వరి.. ఇప్పుడు జరగని విషయం గురించి ఇలా మాట్లాడుతుంటే బాధాకరంగా ఉందని అన్నారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్దికోసం ఎవ్వరినైనా రోడ్డుపైన పెడతారని క్లియర్​గా అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికైనా భువనేశ్వరి జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.  ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై భువనేశ్వరి మాట్లాడుతూ.. తనను అవమానించిన వాళ్లు వాళ్ల పాపాన వాళ్లే పోతారని అన్నారు. నేను ఎవరి నుంచి సారీ ఆశించట్లేదని.. దానికోసం టైం వేస్ట్ చేసుకోనని అన్నారు.

Exit mobile version