Site icon 123Nellore

స్వామీజీ గెటప్​లో ప్రజల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే.. సమస్యలపై ఆరా

ఒకప్పుడు రాజులు రాజ్యంలో తమ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో మారువేశాల్లో వెళ్లి స్వయంగా వారి కష్టుఖాలు తెలుసుకోవడం మనం చాలా సార్లు విన్నాం. అయితే, ఓ స్వామీజి ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అచ్యుతాపురం, అవసోమవరం, అప్పన్నపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి వైకాపా పాలనపై అభిప్రాయాలు అడిగారు. దాంతో పాటు నవరత్నాలపై ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగారు.. అసలు ఆ స్వామీజీ ఎవరో కాదు, ఎమ్మెల్యే రమణమూర్తి రాజు..ఈయన్ను కన్నబాబు అని కూడా అంటారు.

అసలు తన నియోజక వర్గంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనిపించిందో ఏమో కానీ, స్వామీజి గెటప్​తో ప్రజల్లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రజలు తమ సమస్యలను వివరించారు.  నిత్యవసర ధరలు, విద్యుత్​ ఛార్చీలు అధికంగా ఉన్నాయని పలువురు చెప్పగా.. రోడ్లు బాలేవని ఓ గ్రామంలో తెలిపారు.

ప్రభుత్వం 50 శాతం పథకాలు అందిస్తే.. ధరలు పెంచి అందుకు రెట్టింపు మా దగ్గర నుంచి వసూలు చేస్తోందని పలువురు బాధపడ్డారు. ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్న కన్నబాబు.. నేరుగా తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓలను కలిసి ఈ విషయంపై చర్చించారు. అసలు ఇవన్నీ అడుగడానికి మీరెవరంటూ తహసీల్దార్ ప్రశ్నించగా.. వేషం తొలగించి వారికి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలపై 100 శాతం ప్రజలు ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు.

Exit mobile version