Site icon 123Nellore

ఉక్రెయిన్‌లోని తెలుగు డాక్టర్‌ కోసం చిరు ట్వీట్‌..!

ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా నగరాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నాకు. ‘ఆపరేష్‌ గంగా’ పేరుతో భారతీయ విద్యార్థులందరినీ కేంద్ర ప్రభుత్వం దేశానికి తీసుకొచ్చింది.

ఈ నేపధ్యంలో ఒక తెలుగు వ్యక్తి మాత్రం తాను రానని ఉక్రెయిన్లోనే ఉండిపోయాడు. ‘ఈ దేశంలో నేను ఇరుక్కుపోలేదు, నాకు నచ్చే ఉంటున్నా’ అని చెబుతున్నారు. అతని పేరు గిరికుమార్ పాటిల్. అక్కడ ఆయన వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తూర్పు ఉక్రెయిన్లోని సెవెరోదన్యస్క్ అనే చిన్న పట్టణంలో నివసిస్తున్నాడాయన. ఇంతకీ అతను ఉక్రెయిన్ నుంచి రాకపోవడానికి కారణమేంటో తెలుసా? అతడు పెంచుకుంటున్న పులిపిల్లలు. ఆ రెండింటినీ యుద్ధ భూమిలో తాను ఒక్కడినీ రాలేనని తెగేసి చెప్పాడాయన. వాటితో పాటూ తన ఇంటి బేస్ మెంట్లో తలదాచుకుంటున్నాడు. చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి అభిమానించే గిరి.. ఆయన సినిమాలు చూసి స్ఫూర్తి పొంది కొన్నేళ్ల క్రితం బ్లాక్‌ పాంథర్‌, జాగ్వార్‌లను కొనుగోలు చేసి.. పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న పరిస్థితుల్లో తన పెంపుడు జంతువులను వదిలి రాలేనంటూ గిరికుమార్ పేర్కొన్నారు.

ఈ విషయం గురించి తెలుసుకున్న చిరు స్పందించారు. చిరు ట్విటర్లో ‘డియర్ గిరికుమార్… నీకు పులుపై ప్రేమ కలగడానికి స్పూర్తి నేనేనని తెలిసింది. అది నా గుండెను తాకింది. వాటిని యుద్ధభూమిలో వదిలి రాలేక, మీరు కూడా అక్కడే ఉండిపోవడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఆ జంతువుల పట్ల మీ ప్రేమ, వాత్సల్యం ఎంతో ప్రశంసనీయం. మీరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యుద్ధం త్వరగా ముగిసి అక్కడ శాంతి వికసించాలని ప్రార్థిస్తున్నాను. యుద్ధం ముగిసేవరకు మీరూ, మీ జంతువులు సురక్షితంగా ఉండాలి’ అని రాసుకొచ్చారు.

Exit mobile version