మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్నా కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మహా శివరాత్రి సందర్భంగా ‘వైబ్ ఆఫ్ భోళా’ పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. చిరంజీవి నుంచి అభిమానులు కోరుకునే అన్ని హంగులతో సినిమాను తీర్చిదిద్దుతున్నారు.
https://twitter.com/KChiruTweets/status/1498502344094662662?s=20&t=RaSkGkZyXhO6WBrFMPxw9g
మెగాభిమానులు ఆయన్ని ఎలా తెరపై చూడాలనుకుంటారో అంత మాస్ మేనియాను క్రియేట్ చేస్తారని భోళా శంకర్ ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత పక్కా మాస్ లుక్, మాస్ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారు. ‘‘అన్నాచెల్లెల అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలందిస్తున్నారు. డుడ్లీ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమన్నా కథానాయిక. మహా శివ రాత్రి సందర్భంగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు చిరు పోస్టర్‌ను తెగ షేర్ చేసేస్తున్నారు. ఇక చిరు ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తిచేశారు. మరో సినిమా ‘గాడ్ ఫాదర్’ కూడా షూటింగ్ జరుపుకుంటుంది.