దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఎక్కువగా ఉంది. దీంతో చాలా పవర్ కట్ లు కూడా బాగా ఉన్నాయి. అసలే భానుడు ఉగ్ర రూపం దాచ్చుతున్నాడు. ఈ ప్రభావంతో ఎక్కడ బట్టినా.. ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే 045 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అవుతున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో చాలా మంది ప్రజలు ఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. మరో వైపు ఉక్కపోతతో చాలా మంది ఏసీలు కోనుగోలు చేస్తున్నారు. దీంతో విద్యుత్ వాడకం మరింత ఎక్కవ అయ్యింది. దీంతో కరెంట్ ఇబ్బందులు తప్పడం లేదు.
ఇదిలా ఉంటే వేడిని, విపరీతంగా పోస్తున్న ఉబ్బను తట్టుకునేందుకు ప్రజలు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వేడిని, తట్టుకునేందుకు ఓ వ్యక్తి చేసిన ఘన కార్యం అందరి చేత నవ్వులు తెప్పిస్తుంది. ఈ పనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అసలు ఏం జరిగింది.. ఆ వ్యక్తి చేసింది ఏంటి.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ये टेक्निक भारत से बाहर नहीं जानी चाहिये. pic.twitter.com/dUUF0BlGQ2
— Awanish Sharan (@AwanishSharan) April 29, 2022
వీడియోలో ఉన్న దాని ప్రకారం ఓ రూంలో టేబుల్ ఫ్యాన్ ఉంది. అయితే అది తిరగడానికి అసరం అయిన విద్యుత్ లేదు. దీంతో ఆ వ్యక్తి చేసేది ఏమీ లేక… చేతులతో టేబుల్ ఫ్యాన్ రెక్కలను తనకు ఉండే బలాన్ని ఉపయోగించి.. గట్టిగా తిప్పుతాడు. అనంతరం వెంటనే పక్కన ఉన్న మంచం పై పడుకుంటి పోతాడు. ఇలా ఆ వ్యక్తి చేయడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిని ఓ అధికారి ట్విట్టర్లో షేర్ చేశారు.