Site icon 123Nellore

పిడుగు పడినా చావలేదంటే… ఆ గుండె బతకాలి..!

వర్షం వచ్చేటప్పుడు పిడుగులు పడ్డడం అనేది సహజం. ఈ పిడుగులు ఎక్కువగా తాటి చెట్ల మీద లేక ఏపుగా పెరిగిన వృక్షాల మీద పడుతుంటాయి. ఇలా పడడం అనేది తరుచుగా చూస్తుంటాము. ఇక కొన్ని సార్లు అయితే ఏకంగా ఇళ్ల మీద పడి.. సర్వనాశనం చేస్తుంటాయి. ఇలా పిడుగు పడేటప్పుడు దానిలో కొన్ని వేల ఓల్ట్ ల కరెంటు ఉంటుంది. అందుకే అది పడితే చెట్లు కానీ ఇళ్లు కానీ బుగ్గిపాలు అవుతాయి. తీరని నష్టాన్ని మిగుల్చుతాయి. అయితే ఇలాంటి పిడుగు ఏకంగా ఓ వ్యక్తి మీద పడితే.. పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆలోచించండి. బతుకు అనేది ఉండదు కదా.. కానీ ఇటీవల పిడుగుపాటుకు గురైన ఓ వ్యక్తి బతికాడు. దీనిని చూసిన చాలా మంది ఆ వ్యక్తి బతకడం నిజంగా చాలా గొప్ప విషయం అని అంటున్నారు.

 

MAN SURVIVES LIGHTNING STRIKE VIRAL VIDEO

ఇంతకీ ఏం జరిగింది అంటే… ఇండోనేషియాలోని జకార్తాలో ఓ వ్యక్తి పరిశ్రమ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆ వ్యక్తి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటాయి. ఆయన అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండడం కారణంగా ఆ కంపెనీలో ఏం జరిగేది ఏంటి అనేది తెలుసుకోవడానికి అంతా తిరుగుతున్నాడు. అదే సమయంలో ఆ వ్యక్తిపై ఉన్నట్టుండి పిడుగు పడింది. అయితే ఈ వ్యక్తి పై పిడుగుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరా చాలా స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో వాటిని చూసిన ఇతర సిబ్బంది ఒక్క సారిగా అవాక్కయారు. ఇలా పిడుగు పడి కూడా ఓ వ్యక్తి బతకడం అనేది చాలా అరుదు అని అంటున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్​ లో వైరల్ అయ్యాయి.

ఆ వీడియోలో ఆ సెక్యూరిటీ గార్డు.. చిన్న చిన్న చినుకులు పడుతుండగా… ఒక చేత్తో గొడుగు పట్టుకుని వెళ్తుంటాడు. అయితే కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆ వ్యక్తి పై ఒక్కసారిగా పిడుగు పడింది. అదే సమయంలో పెద్ద పెద్దగా మెరుపులు వస్తాయి. దీనితో ఆ వ్యక్తి కుప్పకూలిపోతాడు. అలా పడిపోయిన ఆ వ్యక్తిని చూసేందుకు పక్కన ఉన్న సహోద్యోగులు పరిగెత్తుకుంటూ వస్తారు. అనంతరం ఆ వ్యక్తి బతికి ఉండడం చూసి ఆసుపత్రికి తరలిస్తారు. దీంతో ఆయన క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియోనే వైరల్ అవుతుంది.

Exit mobile version