ఇటీవల కాలంలో చాలా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం.. వాటిలో ఉండే భిన్నమైన చేష్టలు. వీటి కారణంగా ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఇష్టపడుతుంటారు. మరి కొన్ని వీడియోలు అయితే భిన్నంగా కాకుండా చాలా ఎబ్బెట్టుగా కూడా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ వీడియో దేని గురించి అని అనుకుంటున్నారా…?
ఈ వీడియో దేని గురించి అంటే… అరటి పండు ఎలా తిన్నాలి అనే దాని గురించి. ఈ వీడియో ఓ వ్యక్తి అరటి పండు ఎలా తినాలి అనేది సూక్ష్మంగా రికార్డు చేసిన చూపించాడు. ఇదిలా ఉంటే ఈ వీడియో వైరల్ అయితే అయ్యింది కానీ.. నెగటివ్ గా కావడం గమనార్హం. దీంతో చాలా మంది నెటిజన్లు అతని పై ఫైర్ అవుతున్నారు.
How to eat a banana like a Queen pic.twitter.com/dRusxOIt4C
— Historic Vids (@historyinmemes) May 1, 2022
ఈ వీడియోలో ఆ వ్యక్తి చేసింది ఏంటి అంటే… అరటి పండు ను ఆ వ్యక్తి ఫోర్కుతో తిన్నాడు. వీడియోలో ఉన్న దాని ప్రకారం ఆ వ్యక్తి నార్మల్ గా తొక్కు తీసుకుని తినకుండా.. ఫోర్కు సాయం తీసుకుని తిన్నాడు. అది కూడా అరటి పండుకు అటువైపు ఇటుపైపు కోసి, మధ్యలో గాటు పెట్టి చీల్చి తిన్నాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి పై ఫైర్ అవుతున్నారు.