Site icon 123Nellore

విమానంలో బార్.. గంటకు ఎంతో తెలుసా?

British Airways: ప్రస్తుతం మానవుని జీవన విధానం ఎంతో అప్ డేట్ అయిందని చెప్పవచ్చు. ఎన్నో ఉపయోగపడని పాత వస్తువులను తీసుకుని వేరే రూపంలో ఉపయోగపడేలా మలుచుకుంటున్నారు. ఇలా ఎన్నో స్టంట్ లు చేసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు కొందరు. ఇదే తరుణంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ కు సంబంధించిన ఓ విమానాన్ని వంద రూపాయలకు కొని దాన్ని బార్ లా మార్చాడు ఒక వ్యక్తి.

అసలు బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానాన్ని ఒక పౌండ్ కె అమ్మాల్సిన కారణం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చాక పాత విమానాల సర్వీసు ఆగిపోయింది. అటువంటి పాత విమానాలకు ముందుగానే రిటైర్డ్ ఇచ్చేసారు. సో అవి సేవలతో పనిచేయకుండా ఆగిపోయాయి. అక్కడ తుక్కు తుక్కుగా పడి ఉన్న విమానాన్ని కాట్స్ వోల్డ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుజన్నా దీనిని వంద రూపాయలకు కొనుగోలు చేసాడు.

ఉచితంగా తీసుకుంటే బావుండదు అని ఆ ఎయిర్ వే సంస్థకు వంద రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత విమానంలో ఉన్న లోపల భాగాన్ని బార్ లా తయారు చేసాడు. దీనికోసం దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు చేశాడు. విమానం లోపల గ్యాలరీని వేరే స్థాయిలో సెట్ చేసాడు. ఇక అక్కడకు రిచ్ పీపుల్స్ వచ్చి బర్త్ డేస్, పలు ఈవెంట్స్ జరుపుకుంటున్నారు.

సుజన్నా ప్రస్తుతం ఆ విమానంలో పార్టీ చేసుకోవాలంటే గంటకు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాడు. వంద రూపాయల తో కొనుగోలు చేసిన విమానం ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదించి పెడుతుందని చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version