Site icon 123Nellore

రేప్‌ కేసులో సినీ దర్శకుడు అరెస్ట్‌..!

చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల వివాదాలు ఎప్పుడూ సంచలనమే. తాజాగా మలయాళం చిత్ర పరిశ్రమలో మరో వివాదం నెలకొంది. నివిన్‌ పౌలి, మంజు వారియర్‌, అదితి బాలన్‌ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతోన్న మలయాళ చిత్రం ‘పడవెట్టు’. ఆ చిత్ర దర్శకుడు లిజు కృష్ణను అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో ఆదివారం కేరళలోని కన్నూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కొచ్చిలోని మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ వివాదం మాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

కృష్ణ అరెస్టును ధృవీకరించిన పోలీసులు, అతను మించి ఇతర వివరాలు వెల్లడించలేమని చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన ఓ మహిళకు తన చిత్రంలో పనిచేసే అవకాశం కల్పించిన లిజు కృష్ణ.. ఆపై ఆమెతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి చివరికి నిరాకరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాకనాడ్ ఇన్ఫోపార్క్ స్టేషన్‌లో లీజుపై కేసు నమోదైంది. ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. ‘‘లిజు కృష్ణను ఐపీసీ 376 సెక్షన్ కింద అరెస్టు చేశాం. ఫిర్యాదు చేసిన యువతి సినిమాకు చెందిన వ్యక్తి కాదు. ఆ యువతికి చెందిన వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆ యువతితో లిజు కృష్ణకు కొన్నాళ్లుగా పరిచయం ఉంది’’ అన్నారు.

ప్రస్తుతం కేరళలోని కన్నూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది పడవెట్టు సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు. పడవెట్టు సినిమాకు లిజుకృష్ణనే కధ రాసుకున్నాడు. ఇందులో నవీన్ పాలీతోపాటు మంజువారియర్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్ అనే సినిమాకు దర్శకత్వ వహించిన సన్నీవేన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా… కేరళలో అత్యాచార కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆరుగురు మహిళలపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో కొచ్చిలో శనివారం టాటూ ఆర్టిస్ట్ సుజీష్‌ను అరెస్ట్ చేశారు.

Exit mobile version