టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు పలు కార్యక్రమాలకు వెళ్తూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి వెళ్లారు అలాగే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా మహేష్ బాబు హాజరై ప్రేక్షకులను సందడి చేశారు.
ఇక ఎన్టీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన కుటుంబ విషయాలను సినిమా విషయాలను ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో పంచుకున్నారు.ఇక ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ కు ఇష్టమైన ఆహార పదార్థం ఏంటి అని అడగడంతో అందుకు మహేష్ బాబు స్పందిస్తూ తన ఇష్టమైన ఆహార పదార్థం గురించి తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ చేసిన వంటలు తినాలంటే ఎంతో ఇష్టంగా ఉండేదని ఆ వంటకాలను ఎక్కువగా తినేవాడినని తెలిపారు.
ప్రస్తుతం తన అమ్మమ్మ చనిపోవడంతో కేవలం ఉప్పు కారంలేని ఆహారపదార్థాలను తినాల్సి వస్తోందని, ముఖ్యంగా తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. తను తరచూ హైదరాబాద్ బిర్యాని ఎంతో ఇష్టంగా తింటానని ఈ కార్యక్రమం ద్వారా మహేష్ బాబు తనకు ఇష్టమైన ఆహార పదార్థం గురించి తెలిపారు. ఇక ఈ విషయం తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ హైదరాబాద్ బిర్యానీనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.