ఒక్కోసారి కొంతమంది వ్యక్తులు చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. వారిలో చదువుకున్న వారు ఉంటారు. చదువులేని వారు కూడా ఉంటారు. చదువు లేని వారు చేసినా తెలియక చేశారు అని అనుకోవచ్చు. కానీ చదువుకున్న వారు చేస్తే… వారి పైశాచిక ప్రవర్తన చూసేందుకు చాలా మందికి జుబుక్సా కరంగా ఉంటుంది. ఆ విధంగా వారు ఎందుకు చేస్తారో ఇప్పటికీ మనకు అర్థం కాదు. కానీ ఇలాంటి అత్యంత నీచం అయిన ఘటనలు మనం ఇప్పటికే చాలా విన్నాం. కానీ లండన్ లో ఓ లాయర్ చేసిన నిర్వాకాన్ని ఇప్పుడు కింద ఇచ్చిన వీడియోలో చూద్దాం.
అసలు ఏం జరిగింది అంటే… లండన్ లో ఉండే ఓ లాయర్ ఒక రోజు సూపర్ మార్కెట్ కు వెళ్లాడు. అక్కడ ఉన్న ఆహార పదార్థాలకు సంబంధించిన ప్యాకెట్లకు ఓ సిరంజ్ ను తీసుకుని ఎక్కించాడు. ఆ వ్యక్తి ఇలా చేయడం కారణంగా సదురు సూపర్ మార్కెట్ యజమానులకు లక్షల్లో కాక కోట్లలో నష్టం వాటిల్లింది. ఇలా ఆ వ్యక్తి సుమారు మూడు సూపర్ మార్కెట్ లలో చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ వ్యక్తి ఆ సమయంలో ఎందుకు ఇలా ప్రవర్తించారు అనేది దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఇదంతా వ్యక్తి కావాలని చేయలేదని అంటున్నారు ఆ వ్యక్తి తరుపు న్యాయవాది. అతని మానసిన స్థితి బాగోలేదని అంటున్నారు. అందుకే ఇలాంటి పనులు చేసాడని అంటున్నారు. అయితే ఆ వ్యక్తి చేసిన ఘనకార్యంపై దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్యర్యపోయే నిజాలు బయట పడ్డాయి. అతను రక్తం కలిపిన ఆహార పదార్థాలు 37 ఏళ్ల కిందవిగా చూపించారు. దీంతో పోలీసులు ఆ వ్యక్తి చేసిన దానికి షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యక్తి చేసిన నిర్వాకానికి సంబంధించిన కొన్ని వీడియోలు సమాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.