Site icon 123Nellore

నేడు కోర్టు మెట్లు ఎక్కనున్న లోకేష్..పరువు నష్టం..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కోర్టు మెట్లు ఎక్కనున్నారు. అది కూడా విశాఖపట్నంలో కోర్టకు హాజరుకానున్నారు. గతంలో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ వ్యహరించింది అందరికీ తెలిసిందే. అయితే ఆయనపై ఓ ప్రముఖ దినపత్రిక కథనం రాసింది.‘చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి’  అంటూ వార్తను ప్రచురించింది. దీనిపై స్పందించిన లోకేష్ గతంలోనే స్పందించారు. ఈకథనంలో ప్రచురితమైనవి పూర్తిగా అవాస్తవాలనీ, దురుద్దేశ పూర్వకంగానే తప్పుడు కథనం రాశారని గతంలోనే ఆయన ఖండించారు.

ఇదే వ్యవహారంలో 2019 అక్టోబర్ 25 సాక్షి యాజమాన్యానికి లోకేష్ తరపున న్యాయ వాదులు రిజిస్టర్ నోటీసులు పంపారు. దీనికి సంబంధించి అదే ఏడాది నవంబర్ 10న సాక్షి నుండి సమాధానం వచ్చింది. సాక్షి ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని లోకేష్ పరువునష్టం దావా వేశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో తాను చిరుతిళ్లు తిన్నట్లు సాక్షి పత్రిక రాసిందని, సాక్షి రాసిన తేదీలలో తాను ఆ ప్రాంతంలో లేనని తెలిపారు. తాను లేనని తెలిసినా బురద జల్లాలనే ఉద్దేశంతో పరువుకు భంగం కలిగేలా సాక్షి పత్రిక వ్యవహరించిందని పరువునష్టం దావాలో పేర్కొన్నారు.

ఉన్నత విద్యావంతుడిగా, ఒక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన తన పరువు ప్రతిష్టలు భంగం కలిగేలా సంబంధం లేని అంశాలతో ముడిపెట్టి తప్పుడు కథనాలు రాసిన కారణంగా తీవ్రమనోవేధనకు గురైనట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై జగతి పబ్లికేషన్స్, సాక్షి సంపాదకులు వడ్డెల్లి మురళి, విశాఖపట్నానికి చెందిన రిపోర్టుర్లు వెంకటరెడ్డి, ఉమాకాంత్ లపై రూ.75కోట్లు పరువునష్టం దావా వేశారు. ఈ కేసు నేడు విచారణకు రానుంది. దీనికి లోకేష్ స్వయంగాహాజరుకానున్నారు. పరువు నష్టం దావాకు సంబంధించిన 10 శాతం ఫీజును లోకేష్ గతంలోనే చెల్లించారు.

Exit mobile version