Site icon 123Nellore

తప్పు జరిగిందని వాళ్లు నాకు లేఖలు రాశారు :నారా లోకేష్

తనపై తప్పుడు వార్తలు ప్రచురించారని, సాక్షితో పాటు మరో రెండు పత్రికలకు నోటీసులు పంపామని టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేష్ తెలిపారు. పరవు నష్టం దావా కేసులో విశాఖ మెజిస్ట్రేట్ కు సోమవారం లోకేశ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చినబాబు తిరుతిండి 25 లక్షలని తనపై తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. ఓ పత్రిక తప్పు జరిగిందని నాకు లేఖలు కూడా రాశారని వివరించారు. సాక్షిపై రూ.75 కోట్లు, మరో పత్రికపై రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేశామన్నారు.  వార్తలు రాసేముందు వాస్తవాలు, వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని చట్టంలో ఉందన్నారు.

టీడీపీని దిగజార్చేందుకే తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టం.. ఎంతవరకైనా తీసుకెళ్తామని హెచ్చరించారు.రోడ్లపై గుంతలు పూడ్చలేని వాళ్లు రాజధాని నిర్మిస్తారా అని  ఎద్దేవా చేశారు. విశాఖకు మూడేళ్లుగా ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు.  జగన్ నమ్ముకుంటే మునిగిపోతామని వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారని వివరించారు. సినిమా పరిశ్రమపై వైసీపీ కక్ష గట్టిందని, ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాజధాని అని విశాఖలో ఏం పీకారన్నారు. సొంత చిన్నాన్నను చంపితే పట్టించుకోవడం లేదంటే హత్య వెనుక జగన్ ఉన్నాడనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు.

వివేకా హత్య కేసు వెనుక ఎవరున్నారో సునీతా రెడ్డి చెప్పినా జగన్ పట్టించుకోలేదని, సీబీఐ అధికారులపై కేసులు పెట్టడం ఇప్పుడే చూస్తున్నాని వివరించారు. వైసీపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారని,  ఏపీలో అన్ని అస్తులనూ జగన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమని, నిబంధనలకు విరుద్ధంగా జిల్లాల విభజన చేస్తున్నారని మండిపడ్డారు.

Exit mobile version