Site icon 123Nellore

కచోరీ కోసం ట్రైన్​ ఆపేసిన లోకోపైలెట్​… వీడియో వైరల్..!

మంచి ఆహారం కోసం ఎంత దూరం అయిన వెళ్తారు కొందరు. ఒక్క సారి అయిన వాటిని రుచి చూడాలని అనుకుంటారు. అంత రుచి కలిగిన వంటకాలు మనకు సమీపంలో ఉంటే కచ్చితంగా రోజూ అయినా పోయి ఓ రౌండ్​ వేసి వస్తారు. అలా తిని తనలో ఉన్న ఆత్మా రాముడ్ని శాంతింపజేస్తాము. ఇదంతా ఆ వంటకానికి ఉన్న విలువ అటువంటిది. అయితే ఇలాంటి వంటకం కోసం ఓ వ్యక్తి ఏకంగా రైలునే ఆపేశాడు. ఏదో ఒక రోజు అనుకుంటే పొరపాటే. రోజూ ఇదే తంతు. సరిగ్గా ఆ ప్రాంతంలోకి రాగానే ట్రైన్ ఆపడం.. ఆహారాన్ని తెచ్చుకోవడం. ఆ ట్రైన్​ ఆపింది ఏ ప్రయాణికుడో అనుకుంటే పొరపాటే. ఆ ట్రైన్ ను నడిపే లోకో పైలెట్​ ట్రైన్​ ఆపి తనకు కావాల్సిన దానిని తెచ్చుకుని తింటున్నాడు. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

LOCO PILOT IN ALWAR STOPS TRAIN FOR KACHORI VIDEO GOES VIRAL

ఓ లోకో పైలెట్ తనకు ఇష్టం అయిన కచోరీ కోసం రోజు తాను నడిపే ట్రైన్ ను కొంత సేపు ఆపేస్తున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని అల్వార్​ సమీపంలో ఉండే ఓ క్రాసింగ్​ వద్ద జరిగింది. అయితే దీనిపై రైల్వే అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది అవసరాల కోసం ట్రైన్ ను ఆపకూడదని తెలిపారు. ఇందుకు బాధ్యత వహిస్తూ సదరు లోకో పైలట్​ తో సహా మరికొందరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పై అధికారులు.

ఉత్తారాది రాష్ట్రాల్లో కచోరీని అల్పాహారంగా తీసుకుంటారు. మరి కొంతమంది అయితే దీనిని స్నాక్స్​ గా కూడా తింటారు. ఇది వారి సంప్రదాయంలో భాగం. అందుకే తీనిని ఎక్కువగా తీసుకుంటారు. ఇలాంటి కచోరీ కోసం ట్రైన్​ ఆపి ఆ లోకో పైలట్​ ఇబ్బందులను కొని తెచ్చుకున్నాడు. అందుకే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారింది.

Exit mobile version