ఈ రోజుల్లో ప్రపంచంలో ఏ మూలన, ఏది జరిగిన నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అవుతుంది. సరదా కోసం రంగులరాట్నం ఎక్కాలని ఓ చిన్నోడు తహతహలాడాడు. తీరా కట్ చేస్తే “ఆపండిరోయ్ ఆపండిరోయ్” అని అర్థనాదాలు. ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తున్న ఆ వీడియోని మీరు ఒక లుక్కేయండి! పండగ వేళలో, జాతరలలో ఎక్కువగా మనం గిరగిర తిరిగే రంగులరాట్నాలను చూస్తుంటాం. వాటిలో కూర్చొని ఆనందంగా తిరగాలని చిన్నారులతో పాటు, పెద్దలు సైతం ఉత్సాహం చూపుతారు.
12 ఏళ్ల ఒక బాలుడు పెద్దల సమక్షంలో రంగులరాట్నం ఎక్కాడు. మొదట అందరిలాగే అతని ముఖంలో సంతోషం తాండవం చేసింది. కేరింతలు కొడుతూ సంబరపడిపోయాడు. మెల్లగా రంగులరాట్నం తిరగటం మొదలైంది. ఇక చూస్కోండి. …. మనోడి తిప్పలు. “నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో బ్రహ్మనందం పరిస్థితి ఆ బాలుడికి వచ్చింది. దాని వేగానికి అతని ఆనందం ఆవిరయ్యింది. “ఆపండి బాబోయ్ ఆపండి” అంటూ ఏడుపు అందుకున్నాడు. “అమ్మ-నాన్న” అని అరవడం స్టార్ట్ చేశాడు. ఇంకా కొద్దిసేపు ఐతే ప్యాంట్ కూడా తడిపేవాడేమో.
భయంతో ఆ పిల్లాడు చేస్తున్న గోలను, అదే రంగులరాట్నంలో ఉన్న ఒక వ్యక్తి ఆ తతంగాన్ని అంతా వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ బాలుడి పరిస్థితిని చూసిన వారంతా తెగ నవ్వేస్తున్నారు.