Health Tips: ఇటీవల కాలంలో సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల రక్తహీనత బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సరైన తిండి తినకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం పూర్తిస్థాయిలో దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల రక్తహీనతకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మరి రక్తహీనత దరిచేరకుండా ఉండాలి అంటే ఒక లడ్డు తినాల్సిందే. మరి ఆ లడ్డు ఏమిటి. ఆ లడ్డు ఏవిధంగా తయారు చేసుకోవాలో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆ లడ్డూలు తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావలసిన పదార్ధాలు నువ్వులు, ఖర్జూరం. ఈ రెండింటి కాంబినేషన్ లో తయారైన లడ్డూలు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ ఎర్ర రక్త కణాలు అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుంది. అదేవిధంగా రక్తహీనతను తరిమికొడుతుంది. మరి ఈ లడ్డూను చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అర కప్పు ఖర్జూరం తీసుకొని, మిక్సీ జార్ లో గింజలు తొలగించిన ఖర్జూరాలు, అదేవిధంగా వేయించి పెట్టుకున్న నువ్వులు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త గ్రైండ్ చేసుకోవాలి.
అనంతరం ఆ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పలుకులు, కొన్ని బాదంపప్పు పలుకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం చేతికి నెయ్యి లాంటిది పూసుకొని అందులో నుంచి కొంత పదార్థాన్ని తీసుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న ఖర్జూరం నువ్వుల లడ్డూలు డబ్బాలో వేసి ఫ్రిజ్ లో ఉంచుకోవడం వల్ల పదిహేను రోజుల వరకూ నిల్వ ఉంటాయి. ఇక ఈ లడ్డూలను తరచూ రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అంతేకాకుండా రక్తహీనత మళ్లీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక సారి ట్రై చేసి రక్తహీనత సమస్యలు దూరం చేసుకోండి.