Site icon 123Nellore

లైవ్‌ షో లో ఏడ్చేసిన కృతి శెట్టి.. ఎందుకంటే..!

కృతి శెట్టి.. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే.. ఇలా సెన్సేషన్‌గా మారిపోయిన నటి. ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయినా.. ఆ మూవీ విడుదల కాకముందే దాదాపు అరడజను ఆఫర్లు కృతిని వెతుక్కుంటూ వచ్చాయి. అంతే కాకుండా ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ నుండి కూడా ఈ భామ ఆఫర్లు అందుకుంటోంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి చేదు అనుభవం ఎదురైంది.  ఓ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టుకున్న కృతి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు విషయం ఏంటంటే…

తాజాగా కృతి ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆమెకు ‘ఉత్తమ నటి’గా అవార్డు దక్కింది. అవార్డు తీసుకున్న అనంతరం ఆమె ఓ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు యాంకర్స్‌ పాల్గొనగా.. అందులో ఒకరు మాత్రమే కృతిని వరుసగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు కృతి నవ్వుతూ సమాధానాలు చెబుతుండగా.. పక్కనే ఉన్న మరో యాంకర్‌.. ‘‘ప్రశ్నలన్నీ నువ్వే అడిగితే.. ఇక నేను ఎందుకిక్కడ? ఈ ఇంటర్వ్యూలో నన్నెందుకు కూర్చొపెట్టారు? ఈ మాత్రం దానికి ఇంత ఖరీదైన దుస్తులు ఎందుకు? ఈ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఎవరు? కెమెరా ఆఫ్‌ చేయండి’ అంటూ కేకలు వేశాడు. దాంతో ఇద్దరు యాంకర్స్‌ వాగ్వాదానికి దిగారు. అది చూసిన కృతిశెట్టి షాకైంది.

అయితే ఆ తర్వాత అది ప్రాంక్‌ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది కృతిశెట్టి. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు. దానికి ఎవరైన గట్టిగా, కఠినంగా మాట్లాడితే తట్టుకోలేను, భయం వేస్తుంది అని చెప్పుకొచ్చింది 18 ఏళ్ల కృతిశెట్టి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు.. ఆ ఇద్దరు యాంకర్స్‌పై విరుచుకుపడుతున్నారు. ఇదేం ప్రాంక్‌ అంటూ మండిపడుతున్నారు.

https://youtu.be/XUZikroX8VM

Exit mobile version