ప్రజల నాడి చూస్తే జగన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, మూడు సంవత్సరాల్లో జగన్ అరాచకాలు అంతా ఇంత కాదని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా బాదుడే బాదుడని, టీడీపీ చేపట్టిన బాదుడే కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. కడపజిల్లాలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటిష్టమైన యంత్రాంగం ఉన్న పార్టీ టీడీపీ అని, ఎన్టీఆర్ పుట్టిన రోజు తెలుగుజాతి పండుగ రోజని తెలిపారు. జగన్ సభ ప్రాంగణానికి స్టేడియం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
శ్రీలంక లో రాజ్ పక్షే ని ప్రజలు తరిమి కొట్టారని, ఏపీ లో కూడా జగన్ కు అలాంటి పరిస్థితి వస్తుందని జోష్యం చెప్పారు.జగన్ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు నేను అడ్డంకులు కలిగించి ఉంటే ఇడుపులపాయ నుంచి బయటికి వచ్చే వాడు కాదని, నియంతలు అందరూ కాల గర్భంలో కలిసిపోయారన్నారు. సీఎం జగన్ కు ఒక్కటే అడుగుతున్న వైసీపీ వారికి విజ్ఞత ఉంటే అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. జగన్ సీఎం అయ్యాక కడప రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు.
దీపం కింద వంట గ్యాస్ లు ఇస్తే జగన్ సీఎం అయ్యాక దీపం ఆర్పేశాడని, ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు వారికి అండగా నిలబడాలని సూచించారు. నిన్న కర్నూల్ లో సోలార్ పార్క్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, గతంలో తాను సీఎం గా ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే దాన్ని మళ్ళీ ప్రారంభించారని మండిపడ్డారు. 3 సంవత్సరాల్లో సోలార్ ప్రాజెక్టు పూర్తి చేసింటే ఇప్పుడు కరెంట్ కష్టాలు ఉండేవి కాదని, దేశంలో ఎక్కడా లేని పెట్రోల్ , కరెంటు ధరలు ఇక్కడ ఉన్నాయని మండిపడ్డారు.