Site icon 123Nellore

రాజ్యసభకు మోనార్కుడు..ఎక్కడి నుండి.?

నేను మోనార్కున్ని నన్నెవరూ మోసం చేయలేరంటూ సినిమాల్లో డైలాగులు కొట్టే నటుడు ప్రకాశ్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం. అద్భుత నటనతో అందరి మనసు ఆకట్టుకున్న ప్రకాశ్ రాజ్ రియల్ లైఫ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆకట్టుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గతంలో ప్రకాశ్ రాజ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉన్నఫళంగా ప్రకాష్‌ రాజునే రాజ్యసభకు కేసీఆర్ ఎందుకు పంపాల్సి వచ్చిందన్న సందేహం అందరికీ తట్టింది.

నేషనల్ స్థాయిలో ప్రకాశ్ రాజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు జాతీయ రాజకీయ పట్ల ప్రకాశ్ కు పూర్తి అవగాహన ఉంది కూడా. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, మళయాలం బాషల్లో అనర్గలంగా మాట్లాడగలడు కూడా. అతనిలో ఉన్న ఈ సానుకూలతలే కేసీఆర్ జట్టులో స్థానం దక్కడానికి కారణం అంటున్నారు కొందరు.  టీఆర్ఎస్ నుండి త్వరలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ పాల్గొనే సమావేశాలల్లో ప్రకాష్ రాజ్ కూడా పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం.

గతంలో ఫ్రంట్ కోసం చర్చల జరిగిన నేపథ్యంలో దేవెగౌడకు, కేసీఆర్ కు మధ్యవర్తిగా ప్రకాశ్ వ్యవహరించారని టాక్. మూవీ ఆర్టిస్టు ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీకి దిగినప్పుడు టీఆర్ఎస్ మద్దతు కూడా తెలిపింది. అయితే ప్రకాశ్ రాజ్ కేసీఆర్ తో తిరగడంపై బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. దేశద్రోహులుగా చిత్రీకరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. రాజ్యసభకు ప్రకాశ్ రాజ్ ను పంపిస్తారా..లేక ఇంకేదైనా పదవిస్తారా అన్నది తేలాలంటే జరిగే పరిణామాలు చూస్తూ ఊండాల్సిందే.

Exit mobile version