Site icon 123Nellore

మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో.. ట్విట్టర్ లో ఎన్టీఆర్ సతీమణి!

Jr Ntr: టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో.. ఆ పై పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన మానరిజంతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా లెవెల్ లో కనిపించనున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఒక పోస్టుతో సోషల్ మీడియా లోకి అడుగుపెట్టారు. పెళ్లయిన కొత్తలో ఎన్టీఆర్ తో కలిసి ప్రణతి పలు ఆడియో ఫంక్షన్ లలో కనిపించింది. క్రమంగా ఇద్దరు బిడ్డల తల్లి అయిన తర్వాత మీడియాకు కొంతకాలం దూరంగా ఉంది.

కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా ప్రణతి ఆడియో ఫంక్షన్ లకు దూరంగా ఉంది. ఇక ఈమె సోషల్ మీడియాకు కూడా కొంతవరకు దూరంగానే ఉంటుంది. దాంతో ప్రస్తుతం ఆమె ఎలా ఉంటుందో.. ఎం చేస్తుందో అనే అప్ డేట్స్ ఏమి ఎన్టీఆర్ అభిమానులకు తెలియనే తెలియడం లేదు.

 

కానీ తాజాగా ప్రణతి తన ట్విట్టర్ ఖాతా ని ఓపెన్ చేసింది. అందులో మొదటి పోస్టు గా ‘ మీ అందరితో కలిసి ట్విట్టర్ ఖాతాలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో పోస్ట్ చేస్తున్నాను” అంటూ ఎన్టీఆర్ తో ఆమె కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో ట్వీట్ చేసింది.

Exit mobile version