ప్రస్తుతం సమాజంలో మార్పులను అతి తక్కువ సమయంలోనే చూస్తున్నాం. ఎందుకంటే టెక్నాలజీ అంత ముందుకు సాగుతుంది కాబట్టి. శాస్త్రవేత్తలు ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని, ఏదో ఒక అద్భుతాన్ని కనిపెడుతూనే ఉంటారు. అందులో ముఖ్యంగా జపాన్ మాత్రం ముందుంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి కనిపెట్టడానికి బాగా టెక్నాలజీని వాడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా వావ్ అనిపించేలా మరో అద్భుతాన్ని సృష్టించింది జపాన్.
రోడ్లపై తిరిగే వాళ్లకు బస్సు టైర్ గా మారి ఎక్కించుకుంటుంది. అదే పట్టాలపై తిరిగే వాళ్లకు టైర్ల కు బదులు ఇనుప చక్రాలుగా ఆటోమేటిక్ గా మారుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటుంది. ఇక ఈ వాహనం ను ఆసా పోస్ట్ రైల్వే కంపెనీ నిర్వహిస్తుంది. ఇందులో ఒకేసారి 21 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని తెలిపింది. ఇక ఈ వాహనం రోడ్డుపై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే పట్టాలపై 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వాహనానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.