Jagapathi Babu: టాలీవుడ్ ప్రేక్షకులకు జగపతిబాబు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. దాదాపు 100 సినిమాలకు పైగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కుటుంబ కథ చిత్రాలలో ఎక్కువగా పేరు పొందినప్పటికీ.. లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు వంటి సినిమాలలో విలన్ రోల్ లో కూడా తన నటనతో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆశ్చర్యపరిచాడు.
ఇక ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో మరో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు ఇండస్ట్రీలో స్నేహితుల గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు బయట పెట్టాడు. ఇండస్ట్రీలో తనకు ఫ్రెండ్స్ ఎవరూ లేరని తెలిపాడు. కోలీవుడ్ నటుడు అర్జున్ మాత్రమే తనకున్న జెన్యూన్ స్నేహితులలో ఒకరని తెలిపాడు.
చాలా సంవత్సరాల నుండి తనకు అర్జున్ కు మంచి అనుబంధం ఉందని తెలిపాడు. మా ఫ్రెండ్ షిప్ వల్లే ఒకరి సినిమాలో ఒకరు నటించామని తెలిపాడు. ఇక తమ మధ్య ఎక్కువ గొడవలు జరుగుతాయని ఆ గొడవలు చూస్తే ఫ్రెండ్స్ లా కాకుండా శత్రువులు గా కనిపిస్తామని జగపతి బాబు అన్నాడు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం తనకు ఎవరు ఫ్రెండ్స్ లేరని తెలిపాడు. అంతేకాకుండా ఈ క్రమంలో ఎవరి గురించి అయినా ఫ్రెండ్ అని చెప్పాలి అంటే.. వ్యక్తుల ప్రవర్తన అనేది గుర్తుకు రావడంతో వాళ్లను స్నేహితులు అని అనాలి అనిపించిందని అంటూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.