Site icon 123Nellore

నీ భర్తే చంపాడేమో?.. అవినాష్ బీజేపీలో చేరతాడన్నారు.

వివేకా హత్య కేసులో కూతురు సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుపోయే విషయాలను వెల్లడించారు. తన భర్తే హత్య చేయించి ఉంటారని జగన్ తనను ప్రశ్నించారని అన్నారు. హంతకులెవరో పులివెందులలో అందరికీ తెలుసని, అనుమానితుల పేర్లు కూడా చెప్పానన్నారు. ఎందుకు వాళ్లను అనుమానిస్తావ్ అన్నారని జగన్ తనతో అన్నట్లు సునీతారెడ్డి తెలిపారు. తన భర్తపై నిందమోపి అన్యాయంగా జగన్ మాట్లాడారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం.

 అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించి విచారణ చేయించాలని ఛాలెంజ్ చేశానని,  సీబీఐకి ఇస్తే ఏమవుతుంది.. అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడు, అతడికేమీ కాదని జగన్ ఆమెతో అన్నట్లు వివరించారు. అవినాష్ పై 11 కేసులు ఉన్నాయని, దీంతో పన్నెండు కేసులవుతాయని చెప్పారన్నారు. అనుమానితుల పేర్లలో జగన్ భారతిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే  ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరు చేర్చడంపైనా జగన్‌ కోప్పడ్డారని తెలిపారు.

జగన్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం వివేకా హత్యను వాడుకునన్నారని తెలిపారు. ఇప్పుడు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకా అనుచరులను దగ్గరకు రానివ్వడంలేదన్నారు. విచారణ కోసం ఆ తర్వాత పలు దఫాలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా సీబీఐ విచారణ అడగాలని సీఎంను కోరానన్నారు. సీబీఐ విచారణకు తాను కోర్టును ఆశ్రయిస్తే జగన్‌ రాజకీయ భవిష్యత్‌ నాశనమయ్యే ప్రమాదం ఉందన్నారని తెలిపారు. భారతి సోదరుడు ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి వివేకా చనిపోయిన సమయంలో తన భార్యతో ఫోన్లో మాట్లాడాడని, అతడి భార్య సాక్షి మీడియా అడ్మిన్‌.. ఇతర టీవీల్లో అనుమానాస్పద మృతి అని వస్తున్నా ఆమె మాత్రం  గుండెపోటు అని పదిన్నర వరకూ కొనసాగించారని వివరించారు. అయితే  వాంగ్మూలాలు బయటకు రావడంతో వైసీపీపై ప్రతిపక్షాల దాడి ఎక్కువైంది. దీనికి జగన్ ఏం సమాధానం చెప్తారో వేచిచూడాల్సిందే.

 

Exit mobile version