Site icon 123Nellore

నేటితో వెయ్యి రోజులు పూర్తి..సంబరాల్లో వైసీపీ శ్రేణులు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా వెయ్యి రోజులైంది. రాజన్న రాజ్యం తెస్తానని, సంక్షేమ పాలన తెస్తానని ప్రజల్లోకి అడుగుపెట్టి పాలనా పగ్గాలు చేపట్టి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నారు జగన్. వైసీపీ వెయ్యి రోజుల పాలనపై రాష్ట్రంలోని వైసీపీ శ్రేణులు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పలు చోట్ల కేక్ కట్ చేశారు. సంక్షేమమే అజెండాగా జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. పాలనలో ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లను ఎదుర్కొంటూ వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నారు.

ప్రమాణ స్వీకారం నాడే పాలన పక్షాళన చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ దిశగానే అడుగులు వేశారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. సుమారు 4.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. అంతేకాదు మహిళలకు ఆర్థిక పరిపుష్టికోసం కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. జగనన్న చేదోడు, జగనన్నతోడు వంటి పథకాలకు శ్రీకారం చుట్టి రూ.10, రూ.18వేల సాయాన్ని అందిస్తున్నారు. విడతల వారీగా అమలు చెస్తానన్న పెన్షన్ పెంపును రూ.2500లు చేశారు.

రైతులకు రూ.13,500 రైతు భరోసా(కేంద్రం ఇచ్చేవి కలుపుకుని), మత్స్యకార భరోసా వంటి నూతన పథకాలను తీసుకొచ్చారు. వెయ్యి రూపాయల ఖర్చును కూడా ఆరోగ్యశ్రీలో చేర్చారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో మూడు రాజధానుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బిల్లు వెనక్కి తీసుకన్నా త్వరలో ప్రవేశపెడతమని చెప్తున్నారు. ప్రజలకు పాలనా ఫలాలు మరింత దగ్గరకు చేర్చాలన్న ఉద్దేశంతో జిల్లాల పునర్విభన చేపట్టారు. పాలనలో తన మార్క్ కోసం ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

 

Exit mobile version