Site icon 123Nellore

జగన్ రెడ్డి సామాజిక న్యాయం ఆచరణలో శూన్యం: యనమల

వ్యవస్థల మొత్తాన్ని దోచేసిన వ్యక్తి లంచాలు తీసుకోవడం గురించి మాట్లాడటం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ గా మిగిలిపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ‘‘జగన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నాడు. ఇప్పుడు దోచుకుంటున్నారు.  దోచుకున్న డబ్బంతా జగన్ రెడ్డి ఎక్కడ దాచుకున్నాడో చెప్పాలి. క్విడ్ ప్రోకో కేసుల్లో 14 ఛార్జ్ షీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి లంచాలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అధికారులు లంచాలు తీసుకోవడం తప్పైతే జగన్ రెడ్డి క్విడ్ ప్రోకోతో దోచుకోవడం నేరం కాదా?

జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే పరిమితమైపోయింది. ఆచరణలో ఏ ఒక్క సామాజిక వర్గానికి జగన్ రెడ్డి న్యాయం చేయలేకపోయారు. జగన్ రెడ్డి చెబుతున్నట్లు సామాజిక న్యాయం జరిగితే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MDPI)లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఎందుకుంది? గినీ ఆర్ధిక అసమానతలలో రాష్ట్రం 34వ స్థానం నుంచి 43కు ఎందుకు ఎగబాకింది. ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 19వ స్థానానికి ఎందుకు పడిపోయిందో జగన్ రెడ్డి చెప్పగలడా?

జగన్ మూడేళ్లలో విద్యారంగం పతనావస్థకు చేరుకుంది. బలహీన వర్గాలకు విద్యనందిచడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అమ్మఒడి సరిగా ఇవ్వకపోవడంతో కాలేజీల్లో విద్యార్ధులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన NAS (National Achievement Survey) సర్వే 2021 రిపోర్టుతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంతగా దెబ్బతిందో బట్టబయలైంది. కరోనా సమయంలో దాదాపు 50 శాతం మంది పిల్లలకు వర్చువల్ క్లాసులు ద్వారా విద్యనందించడంలో ఏపీ వెనబడిందని రిపోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతం కు పైగా బడుగు, బలహీన వర్గాల పిల్లలే చదువుకుంటున్నారు. జగన్ మోసపురెడ్డి విధానాలతో దళిత, గిరిజన, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోంది.’’ అని అన్నారు.

 

Exit mobile version