Site icon 123Nellore

అమరావతికి జగన్​ ఎప్పుడూ వ్యతిరేకమని చెప్పలేదు.. పక్కనున్న వాళ్లే అలా క్రియేట్ చేశారు- రఘురామ

jagan-never-said-he-was-against-amravati

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవంతంగా పూర్తి చేశారు అమరావతి రైతులు.  న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అనే నినాదంతో తిరుపతికి చేరుకున్న రైతులు.. యాత్రను ముగిస్తూ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రైతులకు మద్దతుగా ప్రతిపక్షనేత చంత్రబాబు నిలబడ్డారు. ఆయనతో పాటు ఎంపీ రఘురామ రాజు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులను, రాజధానితో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్​ను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్లు తెలుపుతూ.. మళ్లీ బిల్లు పెట్టాలంటే పార్లమెంటులో కూడా బిల్​ పాస్ చేయాలని అన్నారు. మరోవైపు ఇటీవలే అమిత్​ షఆ తిరుపతిలో అడుగుపెట్టినప్పుడే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు రఘురామ వివరించారు. అమరావతికి అమిత్​షా ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నారు.

మరోవైపు జగన్ గురించి మాట్లాడుకూ.. ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకమని చెప్పలేదని.. ఆయనతో ఉండే మంత్రులే కావాలని ఈ విషయంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాలని కోర్టుకు చెప్పిన ప్రభుత్వం… స్టేక్ హోల్టర్స్ అయిన రైతులతో ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.  తిరుపతిలో అడుగుపెడితే తనను ఏదో చేస్తామని బెదిరింపులు అందాయని.. కానీ, ధైర్యంతో పోలీసుల సాయంతో ఇక్కడి వరకు వచ్చి ఈ సభకు హాజరైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా రాష్ట్రపతి పాలన విధించాలని పార్లమెంటులో కోరినట్లు తెలిపారు. ఇవే అంశాలను వైసీపీ ఎంపీలు కూడా ప్రస్తావించారని ఆయన వివరించారు. ముందు నుంచి రఘురామ అధికార పక్షమైనప్పటికీ.. తనదైన శైలిలో ఎక్కడ తప్పు అనిపించినా ప్రశ్నిస్తుంటారు. మరి రఘురామ చేసిన కామెంట్లకు అధికార ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలా రెస్పాండ్​ అవుతారో తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ధైర్యంగా నిలబడి అందరికీ తన లాజిక్​ కౌంటర్లతో నోర్లు మూయిస్తూ వచ్చారు రఘురామ.

Exit mobile version