Site icon 123Nellore

జగన్ ఒక బచ్చా..తాటాకు చప్పుళ్లకు భయపడను : చంద్రబాబు

రాష్ట్రంలో ప్రతి ఇంటికి జగన్  బాదుడే బాదడు రీచ్ అయ్యిందని, రాష్ట్రంలో వైసిపి కార్యకర్తలతో సహా అంతా బాదుడే బాదుడు బాధితులని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. కర్నూలు మీటింగ్ చూస్తుంటే మహానాడును తలపించే విధంగా ఉందని పేర్కొన్నారు. టిడిపిని కాలగర్భంలో కలపాలి అనుకున్న వారే కనుమరుగు అయ్యారని మండిపడ్డారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనా కంటే ప్రమాదకరంగా జగన్ పాలన ఒకవైపు విధ్వంసం…మరోవైపు బాదుడు…ఇంకో వైపు అప్పులు టిడిపి ముందు జగన్ ఒక బచ్చా…..వైసిపి తాటాకుచప్పుళ్లకు టిడిపికి భయపడుతుందా? కర్నూలులో టిడిపి జెండాలు ఎందుకు తొలగించారు…కడప ఎయిర్పోర్ట్ లోకి కార్యకర్తలను ఎందుకు అనుమతించలేదు.?

గ్రామ స్థాయి కార్యకర్త నుంచి అచ్చెన్నాయుడు వరకు అందరినీ కేసులతో వేధించారు. అక్రమ కేసులకు బిసి జనార్థన్ రెడ్డి కుంగిపోలేదు…పోరాడారు. కార్యకర్తలపై కేసులు పెడితే నేను చూసుకుంటా…భయపడాల్సిన పని లేదు తప్పుడు లెక్కలకు సిబిఐకి అడ్డంగా దొరికిన జగన్ నాపై మాట్లాడుతాడా? ప్రజలకు పాలనపై ఫ్రస్టేషన్ ఉంది.  వైఎస్ చనిపోతే 5 ఏళ్లు ఓదార్పు చేసిన జగన్…నంద్యాల సలాం కుటుంబాన్ని గెస్ట్ హౌస్ కు పిలిపిస్తారా. కార్యకర్తలకు ఏదైనా జరిగితే నా ప్రాణం పెట్టి కాపాడుకుంటా.  తెలుగు దేశం రాష్ట్రంలో ఇప్పుడు అందరికీ ఒక ఆశగా కనిపిస్తుంది.

పొరుగు రాష్ట్రాల్లో పెట్రో, లిక్కర్ ధర ఎంత…మన రాష్ట్రంలో ఎంత. జగన్ తెచ్చిన మద్యం బ్రాండ్స్ దేశంలో మరెక్కడా లేవు. జె బ్రాండ్స్ తయారు చేసేది జగనే….అమ్మేది ఆయనే..కమిషన్ అయనదే ఇసుక కొరత ఎందుకు వచ్చింది….రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు. రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించడానికి ఎప్పుడూ సిద్దం. 22 ఎంపిలు గెలిపించారు…మరి జగన్ ప్రత్యేక హోదా తెచ్చారా జగన్ రాజ్యసభ అమ్ముకున్నాడు…ఎ2ను సరిగా చూసుకోకపోతే…ఎ1 ఔట్. ఆ భయంతోనే ఎ2కు జగన్ రాజ్యసభ ఇచ్చారు’’ అని విమర్శించారు.

 

Exit mobile version