Site icon 123Nellore

ఆ ఒక్క దాంతో జగన్ రెండు లక్ష్యాలు నెరవేర్చుకున్నాడు : చంద్రబాబు

వివేకా హత్యకేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ హత్యతో జగన్ రెండు లక్ష్యాలు నెరవేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. హత్యతో వివేకాను అడ్డు తొలగించుకుని, తనపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందారని ఆరోపించారు. సర్పంచుల అవగాహన సదస్సులో గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ చేస్తే అవినాష్‍రెడ్డి బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారా లేదా అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల సమస్య, ఉద్యోగుల సమస్యకు తానే కారణమంటున్నారని, ఇన్నింటిని నేనే మేనేజ్ చేయగలిగితే ఎన్నికల్లో నేను ఎలా ఓడిపోతానని ప్రశ్నించారు. బాబాయ్‍ను హత్య చేసినవారు రాజకీయాలకు అవసరమా అని అన్నారు.

శిశుపాలుడికి కూడా 100 తప్పులు చేశాకే పాపం తగిలిందని, జగన్‍రెడ్డికి ఇచ్చిన ఒక్క అవకాశం ఇక చివరి అవకాశమే అని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే..వివేకా హత్యపై ఎన్నో నాటకాలు ఆడారని, జగన్ రెడ్డి మామ ఆస్పత్రి నుంచి వైద్యులను తాను తీసుకువచ్చానా? గంగిరెడ్డి, శివశంకర్‍రెడ్డి, అవినాష్‍రెడ్డి నా మనుషులా? సొంత బాబాయిని చంపితే రెండు లాభాలు వస్తాయని భావించారు. వివేకానందరెడ్డి, అవినాష్‍రెడ్డి తన రెండు కళ్లు అని చక్కాగా చెప్పారు. బాబాయి హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు.

కోడి కత్తి, బాబాయి హత్యతో రెండు నాటకాలు గొప్పగా ఆడారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయొచ్చని ధీమాగా ఉన్నారు. బాబాయి హత్య ఇవాళ అడ్డం తిరిగింది. ఒక్క అవకాశం అని ఇస్తే.. ఇప్పటికే చాలా నష్టం చేశారు. పోలవరం మనకు ఒక వరం. పోలవరంలో 70 శాతం పనులు టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. ఇన్నేళ్లలో పోలవరం పనుల్లో రూపాయి అవినీతిని నిరూపించారా? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధానం చేసిన ఘనత నాదే’’ చంద్రబాబు అన్నారు.

Exit mobile version