Site icon 123Nellore

15వేల అడుగుల ఎత్తు భారీ హిమపాతం మధ్య భారత సైన్యం గస్తీ..!

దేశం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు మన జవానులు. నిత్యం బోర్డ‌ర్ లో శత్రు సేనలు కంచె దాడి అడుగు లోపలికి పెట్టకుండా కాపలా కాస్తున్నారు. నిద్రాహారాలు మాని మరీ మన కోసం కష్టపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మంచు ప‌ర్వ‌తాల్లో ప్రాణాల‌కు తెగించి కాపలా కాయడం అంటే చిన్నా చితక విషయం కాదు. ఓ వైపు మీద నుంచి హిమం ఏక దాటిగా కురుస్తుంటే… కనీసం అడుగు బయట పెట్ట లేని పరిస్థితి ఉంటుంది. అయితే అలాంచి మంచులో కూడా వారు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కర్తవ్య నిర్వహణలో భాగం అవుతున్నారు. అయితే ఓ వైపు ఎముకుల కొరికే చలిలో.. మోకాలు లోతు మంచులో కూడా విధి నిర్వహణపై ఉన్న అంకిత భావంతో ఎక్కడా తగ్గకుండా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇలా 15 వేల అడుగుల ఎత్తులో మోకాలు లోతు మంచులో సైనికులు విధులు నిర్వహిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

 

ITBP-Army-Patrolling-at-Himalayas-goes-viral

15 వేల అడుగుల ఎత్తులో జవానులు దేశం రక్షణలో నిమగ్నం అయి ఉన్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ గా మారింది. ఈ గస్తీకి సంబంధించిన దృశ్యాలను చూసి దేశం మొత్తం సాహో సైనికా అని అంటుంది. మైన‌స్ డిగ్రీల్లో కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే స్పూర్తితో పహాహా కాస్తుండడం నిజంగా అభినందనీయం అని కొనియాడుతోంది. దేశ సేవలో నిమజ్ఞం అయిన ప్రతీ ఒక్కరికీ ఈ స్వతంత్ర భారత్ సెల్యూట్ చేస్తోంది.

మన సైనికులు దేశ ర‌క్ష‌ణ‌లో ఏవిధంగా పాటు పడుతున్నారో చూపించే దృశ్యాలు ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చాయి. ఎముకలు కొరికే చలి ఒక వైపు ఉంటే.. భారీ హిమపాతం మరోవైపు భయపెడుతన్న వీర జవానులు పహారా కాస్తున్నారు. అలాంటి కఠినమైన ప్రదేశాల్లో కూడా మనసైన్యం తగ్గేదే లే అంటుంది. ఈ దృశ్యాలు ఉత్తరాఖండ్​ హిమాలయాల్లో కనిపించాయి. భారత వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఓ హిమపాతం భారీగా ఉన్న కానీ ఏమాత్రం ఏమరపాటుకు ఆస్కారం లేకుండా సరిహద్దుల్లో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు ఐటీబీపీ సిబ్బంది. 15 వేల అడుగుల ఎత్తులో.. బలమైన రోప్​లను ఆధారంగా ఉంచుకొని కాపలా కాస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Exit mobile version