Ram Charan: డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ లకు భారీ అంచనాలే వెలువడుతున్నాయి.
ఇక ఈ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో తిరిగి ఫిబ్రవరి 4న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన విషయాలను రామ్ చరణ్ మీడియా ద్వారా పంచుకున్నాడు. తన తండ్రితో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉందని.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపాడు చరణ్.
ఇందులో తన తండ్రితో పాటు తాను కూడా నక్సలైట్ గా నటిస్తున్న విషయాన్ని తెలిపాడు. ఇక తన తండ్రి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అన్నాడు. ఇదంతా పక్కన పెడితే చరణ్.. ఈ సినిమాలో తాను నటించాలని అనుకోలేదట. తన కంటే ముందు ఈ క్యారెక్టర్ కోసం బయట ముగ్గురుని ఎంచుకున్నారని తెలిపాడు.
ఆ ముగ్గురిలో మహేష్ బాబు కూడా ఉన్నాడని.. ఆ తర్వాత రవితేజ అని కొన్నాళ్లు ఇన్ సైడ్ టాక్ నడిచిందని అన్నాడు. చివరికి తానే సిద్ధ పాత్రలో ఎంపికయ్యాడట. ఈ కథలో నిన్ను తప్ప వేరే వాళ్ళను ఊహించుకోలేకపోతున్న చరణ్.. ఈ కథ విన్నాక నువ్వే నిర్ణయం తీసుకో అని ఒకరోజు కొరటాల శివ ఫోన్ చేసి తనను అడిగాడని తెలిపాడు. అందుకే ఈ సినిమాలో నటించానని తెలిపాడు.