Site icon 123Nellore

రాజశేఖర్ ను ఆ సినిమా నుంచి తొలగించారట!

Raja Shekar: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక మానరిజంతో టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోల స్థాయిలో మెప్పించాడు. ఇక రాజశేఖర్ సినీ నటి జీవితను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉంటే గోపీచంద్, శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో రాజ శేఖర్ నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో కొన్నాళ్ళు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా రాజశేఖర్ ఇందులో మెయిన్ రోల్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమా చిత్రీకరణ భాగంలో శ్రీనివాస్ రాజశేఖర్ ను మెయిన్ రోల్ చేయడానికి అడిగారని దీనికి రాజశేఖర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

కానీ తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రకారం గోపిచంద్ సినిమాలో రాజశేఖర్ నటించడం లేదని తెలిసింది. కారణాలు మాత్రం ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. సోషల్ మీడియాలో వార్తలు ప్రకారం మాత్రం రాజశేఖర్ ను లెఫ్ట్ చేసి ఆ ప్లేస్ లో మరో సీనియర్ నటుడిను తీసుకున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక గోపీచంద్ సినిమా గురించి రాజ శేఖర్ పై వచ్చే వార్తలు పై రాజ శేఖర్ అధికారికంగా ఏమని స్పందిస్తాడో చూడాలి. ఈ ఏడాది రాజ శేఖర్ వరుసగా అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది.

Exit mobile version