Site icon 123Nellore

ఒమిక్రాన్ సోకిందా అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Omicron: గడిచిన రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల చాలా జననష్టం జరిగింది. ఎంతో మంది ఊహించని వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొంతకాలం దీని ప్రమాదం తప్పింది అని అనుకునే సరికి కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. ఒమిక్రాన్ పేరుతో ప్రజలను మళ్లీ వణికిస్తుంది. ఇక ఈ ఒమిక్రాన్ సోకినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎక్కువ కాలం దగ్గు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా కరోనా సోకినా వాళ్లలో దురద గొంతులో సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కాబట్టి దురద మీ శరీరానికి ఏమాత్రం ఆవహించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇక ఒమిక్రాన్ సోకిన వారిలో తలనొప్పి కూడా ఎక్కువగా ఉంటుందట.

కొంతమందికి ఈ తలనొప్పి ఒకపక్క కాకుండా రెండు వైపులా వస్తుందని తెలుస్తోంది. ఒమిక్రాన్ సోకిన కొందరిలో ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయని తెలుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించడం మంచిది. అంతేకాకుండా జ్వరం చలి రూపంలో వస్తుందని తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఒమిక్రాన్ సోకిన వారిలో దగ్గు మూడు వారాల తగ్గడం లేదని తెలుస్తుంది.

కొంతమందిలో గొంతు ఇన్ఫెక్షన్ సమస్య బాగా వేదిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వైద్యుల సమక్షం లోనే మందులు తీసుకోవడం మంచిది. ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఎక్కువ రోజులు దగ్గు కలిగి ఉంటే దగ్గు మందు ద్రవం తీసుకోవడం మంచిది. ఇక ఏదైనా ఈ వ్యాధి సోకిన క్రమంలో వైద్యుల సలహా తప్పకుండా తీసుకోవాలి.

Exit mobile version