తెలుగు సినిమా ఇండస్ట్రీలోఎంతో మంది స్టార్ హీరోలకు తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అద్భుతమైన విజయాలను అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో కృష్ణ పని అయిపోయింది అనుకున్న సమయంలో ఈయన నెంబర్ వన్ సినిమా ద్వారా అద్భుతమైన హిట్ ఇచ్చారు.అలాగే గోవిందా గోవిందా అనే చిత్రంతో భారీ నష్టాలను ఎదుర్కొన్న నిర్మాత అశ్వినీదత్ శుభలగ్నం సినిమా ద్వారా తిరిగి ఆయనను ఇండస్ట్రీలో నిలబెట్టారు. కమెడియన్స్ కేవలం కామెడీ పాత్రలకు మాత్రమే సెట్ అవుతారని భావించే ఎంతోమంది భావనను యమలీల సినిమా ద్వారా ఈయన మార్చారు.
అలీని హీరోగా పెట్టి యమలీల సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించి ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన చిత్రం టాప్ హీరో.ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ క్రమంలోని ఈ సినిమా విడుదలకు ముందే పెద్దఎత్తున బిజినెస్ చేసి నిర్మాతలకు లాభాల ను అందించింది.
ఈ క్రమంలోని టాప్ హీరో సినిమా డిసెంబర్ 9 1994 ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మోయలేక బాక్సాఫీసు వద్ద చతికిల పడిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ కావడంతో బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఎస్.వి.కృష్ణారెడ్డి పెద్ద హీరోలను మేనేజ్ చేయలేరు అనే ముద్ర కూడా వేయించుకున్నారు. ఇలా ఈ టాప్ హీరో చిత్రం విడుదలయ్యి సరిగ్గా 27 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.