పెట్రోల్ బంక్ Viral News: పెట్రోల్ బంక్స్ లను కేవలం పెట్రోల్, డీజిల్ కొట్టించుకోవడానికి మాత్రమే వినియోగిస్తారని అనుకుంటున్నారా. అది నిజమే… కానీ పెట్రోల్ బంక్ లో భారత పౌరులకు ఆరు సేవలను ఉచితంగా అందించాలని రూల్ ఉన్న సంగతి మీకు తెలుసా. అవును … ఈ ఆరు సేవలను ఉచితంగా అందించేటట్లు అయితేనే వారికి పెట్రోల్ బంక్ ను నిర్వహించుకోవడానికి అనుమతులు ఇస్తారు. లేకుంటే బంక్ నిర్వహించడానికి కూడా అనుమతి ఉండదట. ఏ కారణంగా అయినా పెట్రోల్ బంక్స్ ఈ ఆరు సేవలను పౌరులకు అందించకపోతే… తక్షణమే భారత పౌరులు సదరు పెట్రోల్ బంక్ పైన ఫిర్యాదు చేయవచ్చట. ఆ ఆరు సేవలు ఏంటో మీకోసం…
- స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ బంక్స్ విధిగా మూత్ర శాలలను నిర్వహించాలి. మనం చెల్లించే లీటర్ పెట్రోల్ ఖరీదులో 4 నుంచి 8 పైసలు మూత్ర శాలలు, మరుగుదొడ్ల నిర్వహణ కోసం కేటాయించబడుతోంది.
- పెట్రోల్ బంక్ కు వచ్చేవారిలో అవసరం అయిన వారికి ఉచితంగా తాగు నీటిని అందించాలి. ఇందుకోసమే బంక్ డీలర్ ఆర్వో యంత్రం, వాటర్ కనెక్షన్ లను కూడా తీసుకోవాలి.
- బంక్ కి వచ్చే వాహనాలలో ఉచితంగా గాలి నింపాలి. ఇందుకోసం ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేయరాదు.
- పెట్రోల్ బంక్స్ సమీపంలో ఎవరికైనా గాయాలు అయితే… ప్రధమ చికిత్స చేయాలి. ఇందుకోసం అవసరమైన కిట్ ను కూడా పెట్రోల్ బంక్ లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.
- పెట్రోల్, డీజీల్ నాణ్యతా ప్రమాణాలను ఏ వినియోగదారుడు అడిగినా చెప్పాలి. వారికి ఆ హక్కు కచ్చితంగా ఉంటుంది.
- అత్యవసర పరిస్థితులలో ప్రజలకు పెట్రోల్ బంక్ నుంచి ఫోన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి.