ఇటీవలే చిన్న పొదుపు పథకాల గురించి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం చిన్నతరహా పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించ లేదని తెలిసింది. 2021 – 2022 ఆర్థిక ఏడాది ప్రకారం చివరి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను తగ్గించలేదని తెలిసింది.
కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అంతేకాకుండా వచ్చేనెలలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గోవా లలో ఎన్నికల నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉండటంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పై 7.1 శాతం, 6.8 శాతం వడ్డీ రేట్లు వరుసగా కొనసాగనున్నాయి. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా నోటిఫికేషన్ అందించింది. అందులో.. చిన్నతరహా పొదుపు పథకాలపై 2021-2022 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికం వడ్డీరేట్లలో నాలుగో త్రైమాసికంలోని అమలు చేస్తామని తెలిపారు.
ఇక ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి పాత వడ్డీ రేట్లు అమలు అవుతాయని తెలిపారు. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కారణం చిన్నతరహా పొదుపు పథకాలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ప్రజలే ఎక్కువగా పొదుపు చేయటంతో.. ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను తగ్గించినట్లు తెలిసింది.