Site icon 123Nellore

మూత్రంలో మంట వస్తోందా.?

ప్రస్తుత కాలంలో సింహభాగం మంది మనుషులు మూత్రంలో మంట సమస్యతో బాధపడుతూనే ఉన్నారు.వేసవికాలం వచ్చిందంటే ఈ సమస్య మరింత ఎక్కువగా వస్తుంది. దీని వల్ల రోజంతా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మన శరీరం వ్యవర్థమైన ఉత్పత్తులను, హానికరమైన పదార్థాలను మూత్రం, చెమట ద్వారా బయటకు పంపుతుంది. మనకున్న మూత్ర నాళము కొన్ని అవయవాల కలయిక. ఈ అవయవాలు రక్తాన్ని వడపోసి వ్యర్థాలను మూత్రం ద్వారా బహిష్కరిస్తాయి. అయితే మూత్రం మంటగా రావడానికి కారణం శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి లవణాల గాఢత ఎక్కువగా ఉండి కిడ్నిల్లో రాళ్లు ఉన్నా మంట వస్తుంది.

యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ఏర్పడే అవకాశం ఉండటం వల్ల కూడా మూత్రంలో మంట వస్తంది. అంతే కాదు ఒంట్లో వేడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.  సరిగ్గా నిద్ర లేకపోయినా ఒంట్లో వేడి పెరిగి మూత్రం మంటగా వస్తుంది. శరీర ద్రవాల్లోని లవణాల సమతుల్యత కాపాడి శరీరంలోని నీటి పరి మాణాన్ని తగ్గకుండా చూస్తూ జీవకార్య నిర్వహణలో పేరుకునే కాలుష్యాన్ని విసర్జిస్తాయి. ఇలాంటి విధులు నిర్వర్తించే కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు మూత్రంలో మంట వస్తుంది.

మూత్ర విసర్జన మంట వచ్చే సమయంలో నివారణకు ఆరోగ్యకరమైన  ఆహారం తినడం, తగినంత శీతల పానియాలు తాగడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం మంచిది. ఎక్కువగా మజ్జిగ తీసుకోవాలి. నీళ్లలో సబ్జా విత్తనాలు నానబెట్టుకుని ఆ నీళ్లను తాగాలి. సుగంధ తాగితే ఒంట్లో సెగను తగ్గిస్తుంది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. లైంగికంగా ఎక్కువగా కలిసుండటం కూడా అంత మంచిది కాదు. ప్రతి 6నెలలకు ఒకసారి మూత్ర పరీక్ష చేయించుకోండి. మంట తగ్గించుకునేందుకు డోలోసిస్ డి54, జైన్ కెల్తా పాలుస్ట్రిస్ వాడితే తగ్గిపోతుంది. వేడి వస్తువులకు వీలైనంతగా దూరం పాటించండి

Exit mobile version