Site icon 123Nellore

ఎండాకాలం మీ అందం చెదరకుండా ఉండాలంటే..?

ఎండాకాలం వచ్చేసింది. ఈ సమయంలో కాస్త గ్లామర్ గా ఉన్నవాళ్లు ఈ ఎండదెబ్బకి బయటకు రావాలంటే భయపడిపోతారు. అంతేకాదు ఎంత అందంగా ఉన్నా ఎక్కువగా ట్రావెల్ చేస్తే ఆ అందం మసకబారాల్సిందే. అయినా అందం ప్రియులు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తూచతప్పకుండా పాటిస్తే అందాన్ని నిలుపుకోవచ్చు..పోయిన అందాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. సన్‌స్ర్కీన్‌ లోషన్‌ చర్మానికి రాసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదు. వెళ్లే టప్పుడుకాకుండా అరగంట ముందు రాసుకుంటే చాలా మంచిది.

ఎక్కువగా ఎండకు తిరగడం వల్ల, వడగాలుల వల్ల జుట్టు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. బయటకు వెళ్లి వచ్చాక క్లెన్సర్‌తో ముఖం శుభ్రం చేసుకోవాలి. లేదంటే అందుబాటులో ఉన్న చల్లటి నీళ్లతో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. షాంపుతో రోజూ తలస్నానం చేయండం అంత మంచిది కాదు. కాబట్టి   హెయిర్‌మాస్క్‌ ను వారానికి ఒకసారి వినియోగించాలి. గ్లిజరిన్‌ ఉండే ఫేసియల్‌ వాటర్‌ను ఉపయోగించాలి. ఇది వాడటం వల్ల చర్మానికి నిగారింపును అందించడంతో పాటు మృదువుగా ఉండేలా చేస్తుంది. చెమట ఎక్కువగా పోయడం వల్ల, బయట తిరగడం వల్ల ముఖం, చేతులు నల్లబడతాయి.

అందుకే యాంటీ ట్యానింగ్‌ క్రీమ్‌ ఉపయోగిస్తే పోయిన ఎరుపును తిరిగి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. వారానికోసారి చర్మానికి ఫేసియల్‌ అప్లై చేసుకోవాలి. నాలుగు నుండి ఆరు స్ట్రాబెర్రీలు తీసుకుని మెత్తగా క్రీమ్ లాగా చేసుకోవాలి. అందులో ఒక చెంచా పెరుగు, ఒక అరచెంచా నిమ్మరసంతో బాగా కలిపి మొహంపై రాసుకోవాలి. అలా అప్లై చేసుకున్న అరగంట తరువాత మంచినీళ్లతో శుభ్రం కడుక్కోవాలి. ఇలా చేసిన తర్వాత బయటకు వెళ్లాల్సి వస్తే కచ్ఛితంగా సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకుని వెళ్తే చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

 

Exit mobile version