Site icon 123Nellore

చలికాలంలో ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే…

డిసెంబర్‌లోకి అడుగుపెట్టాం చలికాలంలో మన శరీరం ఎక్కువ వెచ్చదనాన్ని కోరుకుంటుంది. ఎక్కడ వెచ్చగా ఉంటే అక్కడికి వాలిపోతుంటారు. ఈ చలికాలంలో “హైపోథెర్మియా” సమస్య అధికంగా ఉంటుంది. ఇంతకీ “హైపోథెర్మియా” అంటే ఏంటి అని అందరికీ ప్రశ్న మొదలు అవ్వచ్చు. హైపోథెర్మియా అంటే వాతావరణంలో చల్లదనానికి – మన దేహం ఉత్పత్తి చేసుకునే ఉష్ణోగ్రతకు మధ్య చాలా వ్యత్యాసం రావడాన్ని, బయటి ఉష్ణోగ్రతలు పడిపోయిన స్థాయికి దీటుగా దేహం ఉష్ణోగ్రతలను పెంచుకోలేకపోవడం వల్ల దేహం చల్లబడడం. దీనిని మెడికల్‌ ఎమర్జెన్సీగా పరిగణించాల్సిన ప్రమాదకర స్థితి. హైపోథెర్మియాతోపాటు కీళ్ల నొప్పులు కూడా ఎక్కువవుతాయి. చలికాలంలో బారోమెట్రిక్‌ ప్రెషర్‌లో వచ్చే మార్పుల వల్ల కీళ్ల దగ్గర ఉండే టిష్యూలు ఉబ్బుతాయి. ఈ సమస్య నుండి తమను తాము కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలను నిపుణులు చెబుతున్నారు.

రోజూ నడక, తేలికపాటి యోగాసనాలను ప్రాక్టీస్‌ చేయాలి. వాకింగ్‌కి పదకొండు గంటల సమయం మంచిది. అప్పటికి చలి తీవ్రత తగ్గుముఖం పట్టి సూర్యుడు నడినెత్తి మీదకు వస్తుంటాడు. అలానే సాయంత్రం నాలుగు గంటల లోపు వాకింగ్‌ పూర్తి చేసుకోవాలి. అరగంట నుంచి గంట సేపు సూర్య కిరణాలు దేహాన్ని తాకేటట్లు చూసుకుంటే కీళ్లు నొప్పి సమస్యలను దూరంగా ఉంచవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ద్రవాహారాలు ఎక్కువగా  తీసుకోవాలి. రోజూ ఒక పెద్ద కప్పు వెజిటబుల్‌ సూప్, ఈ సీజన్‌లో దొరికే కమలాల వంటి తాజా పళ్ల రసం ఒక పెద్ద గ్లాసు తీసుకోవాలి. అలాగే రోజుకు ఒకసారి మిరియాల టీ లేదా తులసి టీ తాగితే జలుబు, దగ్గు దరి చేరవు. వారానికి ఒకటి – రెండు సార్లు గోరు వెచ్చటి ఆయిల్‌తో దేహానికి మసాజ్‌ చేసుకోవాలి. రోజూ ఆకుకూరలు, కూరగాయలు, ఉడికించిన గుడ్డులు రెండు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చలికాలానికి భయపడాల్సిన పని లేదు.

Exit mobile version