Site icon 123Nellore

ప్లేట్ లెట్స్ తగ్గాయా… ఇలా చేస్తే పెరగడం గ్యారంటీ !

ప్రస్తుత కాలంలో జ్వరం వచ్చిందంటే చాలు అధికంగా ప్లేట్‌లెట్స్‌ పడిపోతుంటాయి. దీని వల్ల పేషెంట్‌ ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుంటుంది. మందులతో పాటు కొన్ని రకాల పండ్లు, ఇతర ఆహార ప‌దార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి.

సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్స్ కణం 7-10 రోజుల వరకు బతికి ఉంటుంది. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించి ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు ప్లేట్‌లెట్స్. ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరగాలంటే ఆప్రికాట్‌ పండ్లను రోజు రెండు సార్లు తీసుకుంటే చాలు. రక్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయి. అలానే ఎండు ఖర్జూరం, కివీ పండ్లను తింటున్నా ప్లేట్‌లెట్లను బాగా పెరుగుతాయి.

ఇక ముఖ్యంగా బొప్పాయి పండ్లు డెంగీ వ్యాధికి మంచి ఔషధంగా పని చేస్తుంది. దీని ద్వారా డెంగీ జ్వరం నుంచి బయటపడడమే కాకుండా వేగంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దానిమ్మ పండ్లను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతాయి. ఇవి రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. క్యారెట్‌ను తరచూ తింటున్నా రక్తం వృద్ది చెంది తద్వారా ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయి.

Exit mobile version