Site icon 123Nellore

విటమిన్లు లోపించడం వల్ల ఏఏ చర్మ సమస్యలు వస్తాయో తెలుసా… వాటికి పరిష్కారం ఏంటంటే

వయస్సు పెరుగుతున్న చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్లు కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఏ విటమిన్లు తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి. అలానే ఏ విటమిన్లు లోపించడం వల్లన ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది ఒక సారీ పరిశీలిద్దాం…

“విటమిన్ ఎ” లోపించడం వల్లన చర్మం పొడిగా, మరియు కంటి చూపు సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఆహారంలో క్యారెట్, పాలకూర, చేపలు, గుడ్డు సొనలు మొదలైన తీసుకోవాలి. వీటిలో “విటమిన్ ఎ” పుష్కలంగా లభిస్తుంది. “విటమిన్ బి కాంప్లెక్స్” ఇది చర్మం, జుట్టు మరియు గోరు కణాలలో కీలకమైన భాగం. ఇది లోపించడం వల్ల జుట్టు రాలడం, చర్మం దురదలు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు, గుడ్లు, వోట్మీల్, అవకాడోలు, పొద్దుతిరుగుడు గింజలు, బియ్యం తీసుకోవడం వల్ల ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు వీటిలో విటమిన్ బి అధికంగా ఉంటుంది.

“విటమిన్ సి” కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. సూర్య కిరణాల వల్ల దెబ్బతిన్న చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలను దూరంగా ఉంచుతుంది. విటమిన్ సి సిట్రస్ పండ్లు, జామపండ్లు, బెల్ పెప్పర్స్, ఆకుకూరలు, కాలీఫ్లవర్ వంటి వాటిలో అధికంగా ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేకుండా పుష్కలంగా లభించే విటమిన్ “డి విటమిన్”. ఇది చర్మ కణాల జీవక్రియలకు అలానే వాపును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. విటమిన్ డి పొందడానికి రోజూ ఉదయం 10-15 నిమిషాలు సూర్యరశ్మి లో ఉంటే సరిపోతుంది.

Exit mobile version