Site icon 123Nellore

మీరు ఫుడ్ అతిగా తింటున్నారా అయితే మీకు ఈ ప్రమాదాలు తప్పవు!

Health Tips: ఈమధ్య కాలంలో కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలకు అడిక్ట్ అవుతున్నారు. వీరు ఈ ఆహారం తినే క్రమంలో ఏ మాత్రం ఆలోచించకుండా కావాల్సినంత కడుపులో పట్టిస్తున్నారు. కానీ కొందరు ఇష్టంగా తినడం వల్ల కడుపు నింపినప్పటికీ చాలావరకు ప్రమాదమని తెలుస్తుంది. ఇక అలా తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం.

కొవ్వు పెరుగుతుంది: అతిగా తినడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. పొట్టలోని ఆహారం ఎక్కువ సేపు స్టాక్ ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో అదనపు కొవ్వు పెరిగిపోతోంది. తద్వారా బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడతాయి.

మధుమేహం: క్రమం తప్పకుండా అతిగా తినడంవల్ల శరీర బరువు మరింత పెరుగుతుంది. తద్వారా శరీరంలో టైప్ 2 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇలా అతిగా తినడంవల్ల రక్తంలో చక్కెర స్థాయిని అరికట్టడం కష్టమవుతుంది.

గుండె సమస్యలు: క్రమంగా ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు కూడా ఎక్కువ శాతం విడుదలవుతాయని తెలుస్తుంది. తద్వారా రక్తపోటు కూడా ఏర్పడే అవకాశం ఉందట.

నిద్రకు అంతరాయం కలుగుతుంది: ఆహారం ఎక్కువగా తినడం వల్ల బద్ధకం ఎక్కువగా ఏర్పడుతుంది. దీనివల్ల నిద్రపోయే విధానాల్లో మార్పు వస్తుంది. కాబట్టి తగినంత ఆహారం తిని కావాల్సినంత నిద్రపోవడం మంచిది. అంతేకాకుండా ఇలా ఎక్కువగా తినడం వల్ల మెదడు పనితీరులో కూడా కొంతవరకు మార్పు వస్తుందని తెలిసింది.

Exit mobile version