Boosting Immunity : ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా రోగ నిరోధక శక్తి లోపం అందరిలోనూ ఏర్పడుతుంది. ఇక ఈ మధ్య మొదలైన కరోనా మహమ్మారి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి మరింత ప్రభావం చూపుతుంది. కాబట్టి కొందరు కొన్ని రకాల ఆహార పదార్థాలను స్పెషల్ గా తింటున్నారు. అవే కాకుండా మరి కొన్ని ఆహార పదార్దాలు తింటే మంచిదని తెలుస్తుంది. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
బాధం: బాదంపప్పు మన శరీరానికి మరింత మేలు చేస్తుంది. బాదంపప్పులు అధికంగా ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదలకు బాగా సహాయపడతాయి. ఇక రోగనిరోధక శక్తిని పెంచే ఐరన్ కూడా ఈ భాదంలో ఉంటుంది. అంతేకాకుండా భాదంలో ఎక్కువగా ఉండే విటమిన్ ఇ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది.
అక్రోట్లను: ఈ వాల్ నట్స్ మెదడు ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుస్తాయి. అంతేకాకుండా ఇది మన శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ వాల్ నట్స్ శరీరం యొక్క జీవక్రియ కూడా మేలు చేస్తాయి.
బ్రెజిల్ నట్స్: చాలా రుచిగా, లేతగా ఉండే ఈ బ్రెజిల్ నట్స్ శరీర ఆరోగ్య ప్రయోజనాలను మెరుగుపరచడానికి తమ వంతు సహాయం చేస్తాయి. ఇక రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ నట్స్ క్రమంగా తినడం వల్ల గుండె మెదడుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టొవచ్చు. ఇక జీడిపప్పు, పిస్తా పప్పు, ఎండుద్రాక్ష కూడా శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి ప్రధాన పాత్రను పోషిస్తాయి.