Brahma Muhurta: సాధారణంగా కుటుంబంలో ఏదైనా మంచి పని, శుభకార్యం, గృహ ప్రవేశాలు లాంటివి చేయాలంటే పెద్దవారు దుర్ముహూర్తాలు, రాహుకాలం లాంటివి సంభవిస్తాయని భావిస్తారు. దాంతో శుభముహూర్తాలు కోసం వేచి చూస్తూ ఉంటారు. మంచి శుభ ముహూర్తం ఉన్నట్లయితే వెంటనే మంచి పనులు చేస్తుంటారు. అలాగే బ్రహ్మ ముహూర్తం అనేది కూడా ఒకటి ఉంటుంది.
ఈ ముహూర్తం చాలా మంచి ముహూర్తం. ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి కూడా. అంతేకాకుండా మనం కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం 3:45 నుండి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుందట. ఈ సమయం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందని, మెదడు పనితీరు కూడా మరింత చురుకుగా ఉంటుందని తెలుస్తుంది.
ముఖ్యంగా ఆ సమయంలో ఏ కోరిక కోరుకున్న అది కచ్చితంగా నెరవేరుతుందని అంటున్నారు. ఆ సమయంలో అడ్డంకులు ఏమీ ఉండవు కాబట్టి మనం ఏది కోరుకున్న వెంటనే జరిగిపోతుంది. ఆ సమయంలో మనం ఓపికగా నిద్రలేచి కాస్త శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఇక ఆ సమయంలో ఓంకారం ను ఇరవై ఒకటి సార్లు చదివితే చాలా శక్తి లభిస్తుంది. అలా క్రమంగా 21 రోజులు చేస్తే ఖచ్చితంగా అనుకున్నవి నెరవేరుతాయి.
ఇక ఉదయాన్నే త్వరగా మేల్కోవడం ద్వారా ఇంట్లో వారి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. సూర్యుడు ఉదయించక ముందు లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఉదయాన్నే మేల్కొని అనగా బ్రహ్మ ముహూర్తం లో విద్యార్థులు పరీక్షల సమయంలో చదువుకుంటే వారికి మంచి ఫలితం లభిస్తుంది.