Health Tips: ఈ మధ్య కాలంలో అందరూ జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల పెరిగిన కరోనా, ఒమిక్రాన్ సమయంలో చాలామంది జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురుకుంటున్నారు. ఈ సమస్యలు ఒక్కసారి మొదలైతే అంత తేలికగా వదిలిపెట్టే మార్గం లేదు. ఇక ఇలాంటి సమయాల్లో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే.. ఆ సమస్యలు మరింత పెరుగుతాయట. ఇంతకు ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
పాలు: జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు పాలను దూరం పెట్టాలి. పాలు తాగడం వలన ఛాతిలోని శ్లేస్మం మరింత పెరిగే అవకాశం ఉంది. జలుబు, దగ్గు సమస్యలు ఉన్నప్పుడు.. పాలు తాగడం అంత మంచిది కాదని నిపుణులు వెల్లడించారు.
అన్నం: అన్నం ఎక్కువగా చల్లదనాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా శ్లేస్మం కూడా ఏర్పడుతుంది. కాబట్టి రెండు సమస్యలతో బాధపడుతున్నవారు.. అన్నం కూడా అంత మంచిది కాదని డాక్టర్ల ద్వారా తెలుస్తోంది.
చక్కర: ఒకవేళ దగ్గు ఉన్నట్లయితే.. చక్కర కలిగిన పదార్థాలను అసలు తినవద్దు. ఎందుకంటే చక్కెర చేతిలోని మంటను మరింత పెంచుతుంది. అంతే కాకుండా చక్కెర రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. కాబట్టి దగ్గు సమస్యతో బాధపడే వారు చక్కెరకు దూరంగా ఉండడం మంచిది.
కాఫి: జలుబు, దగ్గు మన శరీరంలో ఏర్పడిన సమయంలో కాఫీ లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే కాఫీలోని కెఫిన్ గొంతు కండరాలు పొడిబారడానికి దారి తీస్తాయి. తద్వారా మరింత దగ్గు పెరుగుతుంది. కాబట్టి ఇకపై జలుబు దగ్గు వల్ల సమయంలో కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.